ఈ పుటను అచ్చుదిద్దలేదు
162
కాళిదాస చరిత్ర
దన కుమారుని బిలిచి "నాయనా! నాశ్రాద్ధసమయమున మహాకవియగు కాళిదాసును భోక్తగాజేసి పితృయజ్ఞము చేసితివేని నాకుత్తమ గతులు గలుగును. ఊరూరు సంభావనలకుదిరిగి నీరుకాసులు పట్టి ప్రతివారిచేత గాళ్లుగడిగించుకొని తిలదానములు నగ్నపచ్చాదనములు మొదలైన దుర్ధానములు బట్టనట్టి బ్ర్రాహ్మణులని బిలువవద్దు. ఆ దఱు గాళిదాసువంటివారు దొరకకపోయినను నతనిని మత్రము బిలిచి శ్రాద్ధకర్మ చేయుమని చెప్పి కాలధ్సర్మమొందెను.
కాళిదాసుడు వేశ్యాలోలుడై నిరంతరము దాని గృహమునందే కాలముగడుపుచుండుటచేతను సదాచారపరాయణులగు బ్రాహ్మణులవలె నతడు నిష్ఠాగరిష్ఠుడు కాకపొవుటచేతను, బ్రాహ్మణకుమారుడు కాళిదాసునియందు సహజముగా నిష్టములేనివాడయ్యు జనకునియందలి భక్తిచేత నతని కడపటి యాజ్ఞ పరిపాలింపవలయునని కాళిదాసుని భోక్తగా నిమంత్రించెను. ఆ దినమున గాళిదాసుడు ప్రొద్దెక్కి నిదురలేచి కాలకృత్యములు దీర్చికొని స్నానము చేయక రుద్రాక్షమాలకుమారుగా బుష్పహారములు వైచికొని విభూతికిమారుగా మేన మంచిగంధమలందు కొని సిగను జాజిపూలదండ చుట్టి లలాటమున బోగముది దిద్దిన కస్తూరితిలకము మెఱయుచుండ గర్పూరవీడ్యము నమలుచు నత్తరువు పన్నీరు సువాసనలతో గుమగుమలాడు చాకింటిమడతలు గట్టుకొని వీధులవెంట విహారముచేయవచ్చిన కామదేవుండో యనునట్లు బ్రాహ్మణకుమారునింటికి బోయెను. బ్రాహ్మణకుమరుడును దక్కిన బ్రాహ్మణ కుమారులును వానినిజూచి "అయ్యా! పరమపవిత్రమైన పితృకర్మకు నీ వీ యపవిత్ర వేషముతో వచ్చుట ధర్మమా? కావున కాళిదాసుడు మందహాసము చేసి "ఓయీ! నాకన్న శుచియైన బ్రాహణుడెవ్వడు? ఒక్కముక్కకైన నర్ధము తెలియకుండ గొడ్దుగేదె యఱచినట్లు వేదములు వల్లించు నీ బ్రాహ్మణులు నాకన్న బవిత్రులా? అట్లయిన