161
కాళిదాస చరిత్ర
వారించిరి. అదివిని రాజు మందబుద్ధిని బిలిపించి జరిగినది జరిగినట్లు చెప్పమని యానతిచ్చెను. వాడు గడగడవడకుచు నట్టడవిలో నడిరేయి జరిగిన యుదంతమంతయు దేటతల్లముగ దంఢధరసమాను డైన యా రాజచంద్రునకు విన్నవించెను. అప్పుడు సైతము విద్వజ్జనులును శాంతినొందక చనిపోయిన వాని యభిప్రాయ మది కాదని వాదించిరి. అప్పుడు భోజరాజు "మహకవీ! దీనికి నీ వేమందు" అని యడిగెను. అప్పుడు కాళిదాసుడు "దేవా! మృతినొందిన బాలకుని తలయు, మొండెము దెప్పింపుడు" అని మనవిచేసెను. రాజు మందబుద్దికి గొందఱు సేవకులను సహాయమిచ్చి యచ్చోటికి బంపి మేధాశాలియొక్క శిరస్సును మొండెమును దెప్పించెను. కాళిదాసుండు తన యిలవేలుపై కల్పవృక్షముపగిది తనమనోరధములనెల్ల నీడేర్చుచున్న లోకమాతయైన భువనేశ్వరిని ధ్యానించి యామె పాదారవిందములను దనహృదయపద్మమున నిలిపి నవనవస్తోత్రములనెడు పువ్వులతో బూజించి రాజసభాంతరాళమున దనకప్రదిష్టరాకుండ గాపాడుమని వేడుకొనెను. భక్తవత్సలయు, గృపా సముద్రయు నైన భువనేశ్వరి యాతని కోరిక ప్రకారము మేధాశాలిని బ్రదికించెను. అతడు లేచి కూర్చుండి "అప్రశిఖ" యని పలికెను. "నీయభిప్రాయమే" మని సభాసదులు వాని నడుగగా జరిగిన వృత్తాంతమంతయు జెప్పి తుచ తప్పకుండ గాళిదాసు చెప్పినట్లే తాను రచించిన శ్లోకమును జదివెను.
అదివిని ధారానగరవాసులందఱు విస్మితులైరి. సభాసదులు తెల్లబోయిరి. విద్వాంసులు తలలు వంచుకొనిరి. రాజు సంతొషవారిధిందేలి కాళిదాసునిపై గనకవర్షము గురిపించెను.
వి చి త్ర శ్రాద్ధ ము
ధా రా పు ర ము న నొక
బ్రాహ్కణుడు శతవర్షంబులు
జీవించి కాళిదాసు ప్రభావ మెఱిగినవాడగుటచే మరణ సమయంబున