పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
160

కాళిదాస చరిత్ర

విచారింపకుడు" అని ఎన్నో అబద్దములు చెప్పి కల్లబొల్లి యేడుపులేడ్చి యూరందఱు దన్నూఱడింప నూఱడిల్లినట్లు నటించెను. "నాయనా! కడసారి మాబిడ్డ మాకేమిచెప్పమనియె"నని వాని తల్లిదండ్రులడుగ "అప్రశిఖ" యనిచెప్పమనియె నని యాహంతకుడు పలికెను. దాని యర్ధము బోధపడక వారు పలుతావుల కరిగి బహుపండితుల నడిగిరి. వారు తమ కేమియు దెలియదనిపలికి జ్వరపీడితుడైన యాతులుడు సంధిలో నట్లు ప్రేలియుండునుగాని దాని కర్ధముగిర్ధము లేదనిచెప్పిరి. అతి మేధాశాలియైన తమ కుమారుడు నిరర్ధకమైన శబ్ధము తమకు గడపతి వర్తమానముగా బంపడని నిశ్చయించి వారు ధారాపురమునకుబోయి కాళిదాసున కా శాబ్దము దెలిపి యర్దము జెప్పమని వేడుకొనిరి. అతడు కొంతతడ నాలోచించి వారితొ నిట్లు చెప్పెను: "మీ కుమారుడు తనంత్రునిచే నిద్రలో ఖడ్గముచే జంపబడెను. ఆ సంగతి మీవాడొకశ్లోకముగా రచించి యా శ్లోక మతనికీయక నాలుగుపాదముల మొదటి యక్షరములను "అప్రశిఖ" యనుశబ్దముగా గూర్చి వానిచే మీ కంపెను. అతడు జ్వరపీడుతుడై చచ్చియుండడు. మీవాడు రచించినశ్లోక మిట్లుండువచ్చును.

            శ్లో॥అనేన తనవుత్రిప్య
                 ప్రసుప్తస్య వనాంతరే
                 శిఖా మాక్రమ్య పాదేన
                 ఖడ్గే నాభిహతం శిర:

        తా॥ఇతడు విసములో నిద్రపోవుచున్న మీ కుమారునియెక్క శిఖను పాదముతో ద్రొక్కి ఖడ్గముతో శిరస్సు ఖండించెను.
     ఆశ్లోకార్దము వినగానే తలిదండ్రులు గుండెమోదుకొని మహాదు:ఖభరితులైరి. పురజనులందఱు వాని దౌర్జన్యమున కాశ్చర్యమొందిరి. రాజా మందబుద్దిని పిలిపించి దండింపదలచెను. కాళిదాస శత్రువులగు విద్వాంసులు దానియర్ద మదికారనియు: కాళిదాసుడు డంబమునిమిత్తమై మృతినొందినవాని యాశయమదియని చెప్పెననియు