ఈ పుటను అచ్చుదిద్దలేదు
158
కాళిదాస చరిత్ర
విద్వాంసులతో వాదముచేసియు, వేయివరహాలు సంపాదించెను. రెండవ విప్రకుమారుడు నూఱువరహాలు సంపాదించునప్పటికే తలప్రాణము తోకకు వచ్చెను. మేధాశాలి తలిదండ్రులయెడ భక్తిగలవాడగుటచే, తానార్జించిన ధనము తలిదండ్రులకిచ్చి వారి దర్శనము చేసి వస్రి దీవనలు బడసి వివాహమాడవలెనని స్వగ్రామమునకు బైలుదేఱెను. మేధాసాలి యశోధనముల నార్జించుటచేత మందబుద్ది వానియెడల నసూయగలిగి యెట్టకేలకు నడిదారిలో నోంటిగనున్నప్పుడు వానింగడతేర్చి యాధనము తాను స్వీకరింపవలెనని నిశ్చయించుకొనెను.
ఆహా ! ఓర్వలేనితనము, ధనకాంక్ష మనుష్యునిచేత నెట్టి దుష్కార్యములనైనజేయించునుగదా? అట్లేకానిచో నిరపరాధుడును నిరుపమానపాండిత్యప్రకర్ష గలవాడును నైన మేధావి నీమందబుద్ధి చంపదలచునా! ధనకాంక్ష సామాన్యమైనదికాదుగదా! ‘నానాగుణా: కాంచన మాశ్రయంతే ‘ అన్నిగుణములు బంగారము నాశ్రయించును. అట్లుమందబుద్ధి కృతనిశ్చయుడై సమయముకొఱకు నిరీక్షించుచుండెను. ఒకనాడు సాయంకాలము మార్గాయాసముచేత మిక్కిలి యలసి యేగ్రామమును జేరలేక యడవిలో నొకచెట్టుక్రింద బండుకొనిరి. పూర్వకాలము దూరప్రయాణములు చేయువారు చోరులచేతను దుష్టమృగములచేతను బాధగలుగుననిశంకించిఖడ్గములదాల్చి పోవుచుండెడివారు. అందుచేత మందబుద్ధికడ నొక ఖడ్గముండెను. మేధాశాలి దూరము నడచుటచే మిక్కిలిడస్సి గుఱ్ఱుపట్టినిద్రపోయెను. ఆసమయమున దురాత్ముడైన యామందబుద్ధి ఖడ్గముతో నాతనిగొట్టెను.అదరిపడి మేధాశాలి లేచి గాయమునుండి బొటబొట నెత్తురుగారుచుండ ఖడ్గపాణియై తనయెదుట నిలిచియున్న మిత్రునిమొగము నెన్నెలవెలుగునజూచి “ఏమిరా! దురాత్మా ! నన్ను ఝంపుచున్నావు! ధనము కావలసియున్నయెడల నాదగ్గఱున్న వేయివరాలు నీవే పుచ్చు