167
కాళిదాస చరిత్ర
అప్పటికి నమ్మక యేదీ చూపుమని రాజడుగ కాళిదాసుడు తనకిష్టదేవత యైన దేవినిధ్యానించి మూట బైటికిదీయగా నది రామాయణమయ్యెను. కాళిదాసుని బట్టియిచ్చితిమని సంతోషించిన పండితులు లజ్జాననతశిరస్కు లైరి. మాఱుమాటాడక గృహంబులకు బోయిరి.
అ ప ప్ర శి ఖ
భో జ రా జు
మాళవదేశమును
బస్లించుకస్లమున నర్మదానదీతెరమందలి యొకగ్రామమున నిద్దఱు బ్రాహ్మణ బాలకులు సంస్కౄతభాష నభ్యసించుచుండిరి. అందొకడు మేధాశాలి. రెండవవాడు కొంచెము మందబుద్ధి. ఇరువురు నిరుగుపొరుగువారగుటచేతను, నొక్కగురువువద్దనే యధ్యయనము చేయుచుండుటచేతను, మిక్కిలి మైత్రి గలిగి యన్నదమ్ములవలె మెలగుచుండిరి. ఇద్దఱుగలసి నదిలో స్నానము చేయుదురు. ఇద్దఱుగలసి విహరింతురు. అట్లు కొంతకాలము స్వగ్రామమున నధ్యయనముచేసి తర్కవ్యాకరణాదిశాస్త్రములు విధ్యాపీఠమైన కాళికానగరమున జదువదలచి తలుదండ్రులయొద్ద సెలవుగైకొని పోయిరి. వారణాసిజేరి వారొకగురువు నాశ్రయించి తర్కమునందు బాధాంతరమువఱకును, వ్యాకరణమునందు మహాభాష్యాంతమువఱకును జదవి శాంతిజెప్పిరి.
మేధాశాలియైన యాబ్రాహ్మణకుమారుడు నేర్చినవిద్యయంతయు జిహ్వాగ్రముననున్నదో యనునట్లుగా నెట్టి పండితులెట్టి ప్రశ్నల్డిగినను వెంటనే యుత్తరమిచ్చుచువచ్చెను. మందబుద్ధియైన విప్రకుమారుని చదువు గుఱ్ఱపుమేత మరల నెమరువేయుటకు వీలులేనియట్లే సమయమునకు జ్ఞాపకమునకురాకపోయెను. అందుచేత మేధ్దాశాలికి మంచి కీర్తియు దానివలన ధనము చేకూఱుచుండెను. అతడు కొన్నిరాజ సభలకుబోయి యష్టావధానములు మొదలైనవి చేసియు, నాశుకవిత్వము జెప్పియు,