ఈ పుటను అచ్చుదిద్దలేదు
156
కాళిదాస చరిత్ర
అట్లుండ నొకనాడు కాళిదాసుడు జాలరులయొద్ద కొన్ని చేపలను గ్రయమునకు దీసికొని వాటినొక గుడ్డలో మూటగట్టి చంకయందిఅదుకొని మెల్లమెల్లగా బోవుచుండెని. నిరంతరము వానియందలి దోషముల బట్టుకొనిటకై వేటకుక్కలవలె నతనిం గాచుకొనియున్న పండితులా సమాచారము మహారాజున కెఱిగించిరి. వెంటనే మహారాజు బైలుదేరివచ్చి కాళిదాసుని మార్గమధ్యమునం గలసికొని, చంకనున్న మూటనుగుఱించి వానిని గొన్నిప్రశ్నములడిగెను. ఆప్రశ్నోత్తరములీ క్రిందిశ్లోకములయ్తెను.
శ్లో॥కక్షే కిం తన! పుస్తకం, కిముదం ! కాయ్యార్ధనారోదకం,
గంధ: కిం ! ఘన రామరావణ మహాసంగ్రామరంగోద్భవ:
పుచ్చ: కిం! ఘనతాళపత్రలిఖితం, కిం పుస్తకం? హేకవే!
రాజ న్బూసురదై: తైశ్చపఠితం రామాయణం పుస్తకం.
రాజు: హేకవే! కక్షేకింతవ? = కాళిదాసుడా! నీచంకలోని దేమిటి?
కాళిదాసు:పుస్తకం = పుస్తకము.
రాజు: కిముదకం? నీళ్ళేమిటి?
కాళి:కావ్యార్ధనారోదకం = కావ్యార్ధరసము
రాజు: గంధ: కిం? వాసనయేమిటి?
కాళి: ఘనరామరావణమహాస్ంగ్రామరంగోద్భవ:= గొప్పదగు రస్మరావణ యుద్ధమువలన బుట్టిన వాసన.
రాజు: పుచ్చ: కిం ? = తోకయేమిటి?
కాళి: ఘనతాళసత్రలిఖితం = తాటియాకుల పుస్తకము.
రాజు: కిం పుస్తకం? = ఏమిపుస్తకము
కాళి: రాజద్భూసురదైవతైశ్చ పఠితం = బ్రాహ్మణులు, దేవతలు చదువునట్టి రామాయణగ్రంధము.