Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
152

కాళిదాస చరిత్ర

నిశ్చయించి యామె నెయ్యమున కియ్యముకొనియెను. కాని, విచ్చుకత్తులు బూనిన కావలివాండ్రుగలిగి యున్నతములైనకోటగోడలుగలిగి దుర్భేధ్యమైన రాజాంత:పురము బ్రవేశించుట దుర్ఘట మగుటచే నాపడతుక తనమందిరమునుండి భవభూతిగృహంబునకు నొక సొరంగము ద్రవ్వించి యందుండి తనమందిరముబ్రవేశింపుమని వానింగోరెను. భవభూతి యట్లేనని ప్రతిదిన మర్ధరాత్రమున సొరంగముదారినుండి యాపడతియంతికముజేరి సుఖించుచుండెను. కొన్నినెలలు గడచునప్పటి కాయెలనాగ గర్భవతియయ్యెను. చెలికత్తెలు తమ తల మీదికి వచ్చునేమోయని మహారస్జునకారహస్యము విన్నవించిరి. నరపాలు డావార్త తనయాంతరంగికులైన బుద్ధిమంతులతో జెప్పి “నిర్భయముగా నిశీధసమయమున రాజాంత:పురము బ్రవేశించి యట్టి దుష్కార్య మాచరించిన ముష్కరుని బట్టుకోవలయు“ నని చెప్పెను.

    అప్పుడువారిలో నొకడామెమందిరము బ్రవేశిఒచి తనబుద్ధికుశలతచేత గోడలో సొరంగమిండుటగనిపెట్టి దానిలో నొక కత్తెరబోనమర్చెను. ఆబాలిక యారహస్యమెఱుగదు. భవభూతియు నది యెరుంగక యెప్పటియట్లుసొరంగౌజొచ్చి కటికచీకటిలో దానిగనలేక కత్తెరబోనులోజిక్కుకొని కంఠమెత్తివగచుటకైన వీలులేకయుత్తరింపబడుచున్న తనకుత్తుకనిండి వచ్చు క్రొనెత్తురుత్తురుతో గోడమీద నీక్రిందివిధమున శ్లోకములో నర్ధభాగమువ్రాసి ప్రాణమువిడిచెను.

     శ్లో॥కేవానసంతి భుని వారిరుహానసంతంసా
        హంసావళీవలయునో జలసన్నివేశా:

    తా॥ ఈవసుంధరలో దామరపువ్వులు శిరోభూషణములుగా, గలిగినట్టియు సరస్సులెన్నిలేవు! 
    తనమనోహరు డెప్పటియట్లు రాకపోవుటచే నాబాలిక వానికై నిరీక్షించుచు నెట్టకేలకు సొరంగముజొచ్చి చచ్చిపడియున్న ప్రియుం