Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

కాళిదాసు చరిత్ర

యార్యులు వక్కాణింతురు. "అస్తి ' యనుమాట కుమారసంభవములో మొదటిశ్లొకములో గలదు. "అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మా" యని కుమారసంభవములోని మొదటిశ్లోకములో మొదటి పాదము 'కశ్చిత్ 'అనునది మేఘసందేశకావ్యములో మొట్టమొదటి మాట. "కశ్చిత్కాంతావిరిహగురురా స్వాధికారత్ర్మ,మత్త:"అనునది యాకావ్యములొని మొదటిశ్లొకములోని మొదటిపాదము. 'నాక్ ' అనునది రఘువంశములొ మొట్టమొదటనున్నది. "వాగర్ధా వివ సంపృక్తౌ" అనునది యాకవ్యములోని మొదటిశ్లోకములో మొదటిపాదము, 'విశేష ' యను పద మేకావ్యమునందు మొదట బ్రయోగించెనో తెలియదు.

కాళిదాసుని యితరగ్రంధములు

ఇదివఱ కుదాహరించిన మూడు నాటకములు, మూడు కావ్యములు గాక

కాళిదాసుదు ఋతుసంహార మను నొక కావ్యమును రచియించెను. ఒక సంవత్సరమునందలి యాఱుఋతువులు మిక్కిలి రసవంతముగా నీ కావ్యమున వర్ణింపబడినవి. అతని కల్పనాచమత్కృతి యంతయు దీనిలో గనబడుచున్నది. ఇవిగాక రోలంబరాజకీయ మను వైద్యశాస్త్రమును, చంద్రలొకమను నలంకారశాస్త్రమును, వృత్తర్దరత్నావళి యను చందశ్శాస్త్రమును, తారావళి యను జ్యోతిశ్శాస్త్రమును, ప్రాభాకర వ్యాకరణంబున దనపేర నొకఘట్టమును రచియించినట్లు లోకమున వాడుక గలదు. కాని, మూడునాటకములు, ఋతు సంహారముతోగూడ నాలుగుకావ్యములు నీతడు వ్రాసెనని పండితు