ఈ పుటను అచ్చుదిద్దలేదు
20]
149
కాళిదాస చరిత్ర
బ్రాహ్మణునకు నమస్కరించెను. ఆశీర్వచనము చేయుటకు మాఱుగా గాళిదాసు చెప్పినట్లు 'అశ్వని, పునర్వసు, కృత్తికా, రేవతి ' యని నాలుగు నక్షత్రముల పేరులుచెప్పి యూరకుండెను. ఆశీర్వాదమైన జేయలేదే మని రాజు కాళిదాసునడిగెను. సబాస్దారులుగూడ దెల్లబోయి చూచిరి. అప్పుడు కాళిదాసుడు రాజుతొ "దేవా ! ఆ నక్షత్రములలోనే యాశీర్వచనము గర్భితమై యున్నది. అది సామాన్యులు గ్రహింపజాలరు. చిత్తగింపుడు. విన్నవించెద" నని యీక్రింది శ్లోకమాసు ధారగా రచియించి చదివెను.
శ్లో॥అశ్వనీ భవతు తేతంయందురా
మందిరే భవతు తేపునర్వసు
కృత్తికాతనయ విక్రమోస్తు తే
రేవతీపతి కనిష్ఠ సేవయా.
తా॥రాజా! రేవతీపతియైన బలరాముని తమ్ముడగు శ్రీకృష్ణుని సేవచేత నీ గుఱ్ఱపునాల యశ్వని యగుగాక! అనగా ననేకాశ్వములు కొలదగుంగాక నీమందిరమందు మాటిమాటికి నను (అనగా బంగారము) చేరుగాక! కృత్తికాతనయుడైన కుమారస్వామి కున్నంత ప్రతాపము నీకు గలుగుగాక!
ఆ పండితునిభావ మెట్లున్నను వానిమాటలను మిక్కిలి చమత్కారముగ సమర్దించి రసభూయిష్ఠమైన శ్లోకముగా రచించినందుకు రాజు సంతసించి కాళిదాసునకు గొప్పబహుమానము చేసెను. ఆమహా కవి యా బహుమానమందుకొని తా నేమియు నందులో గ్రహింపక యదియంతయు బరమదరిద్రుడైన యా బ్రాహ్మణునకిచ్చె.బ్రాహ్మణుడు పరమాశ్చర్యభరితుడై దారిద్ర్య బాధ తొలగించుకొనియె.