కాళిదాస చరిత్ర
ఆశ్లోకము విని రాజు చిఱునవ్వునవ్వి కాళిదాసుడు కవిత్రయమును జక్కగా వంచించినాడని తెలిసికొని "సరే! నీకోరికప్రకారము నీవుండవచ్చునని యానతిచ్చెను. కాళిదాసుయొక్క తెలివితేటలకు, సమయోచితబుద్దికి, సభాసదులు సంతసించిరి. దండి భవభూతిశంకరులు తామంతకుమున్ను కాలిదాసునకు జేసిన మహాపకారఫలము దైవవశమున దామప్పుడనుభవించవలసివచ్చెనని దమ్ముదామే నిందించుకొనుచు నెప్పటి కేది రావలయునో యది రాక మానదని రాజసబవిడిచి ధారానగరము విడచి విరాగులైపోయిరి.
న క్ష త్ర ము శ్లో క ము
గర్భదరిద్రుడైన యొక
బ్రాహ్మణుదు కాళిదాసదర్శనము
చేసి తనదారిద్ర్యదు:ఖము తీఱునట్లు భోజమహారాజు చేత నేమైన నిప్పింపుమనింగోరెను. నీవేమైన జదువుకొంటివాయని కాళిదాసతని నడుగ "మహాత్మా! నాకువారములపేర్లు, తిధులపేర్లు, మాసములపేర్లు, నక్షత్రములపేర్లు మాత్రమువచ్చును లంతకన్న నేవిద్యయు నాకు దెలియదు. నీవే నాపాలిటిదైవమవు. నిన్నే నమ్ముకొనివచ్చితిని. నాకు కడుపెడుపిల్లలు, నన్ను రక్షింపుము. పాలముంచినను నీటముంచినను నీదేభారము" అనిపలికెను. కాళిదాసుడు వానిదురవస్దకు మిక్కిలి కనికరముగలిగి మహారాజుచేత నేమైన నతని కిప్పింపవలనని8 నిశ్చయించి వానిని వెంటబెట్టుకొని యరిగి రాజద్వారముకడ నతనిని నిలిపి రాజు నమస్కరించినప్పుడు నీకుదోచిన నక్షత్రములపేర్లు నాల్గు చెప్పుమని యుపదేశించి తాను రాజసభలోబ్రవేశించి కృపాళుడై ననృపాలునితో గొప్ప పండితుడు వచ్చెనని చెప్పెను. ఆ పండితుని సభాప్రవేశము చేయింపుమని రాజానతియ్య కాళిదాసు డతనిని రావించెను. రాజు