ఈ పుటను అచ్చుదిద్దలేదు
147
కాళిదాస చరిత్ర
స్వామీ! జనకశ్యావల్లభా! ఓ ప్రభూ! అనుగ్రహింపుము అని మొఱవెట్టుచు దినముల నెన్నడు నిమిషముల వలె గడువుదునోగదా!
అది విని మహారాజు "నీవయోధ్యాపురంబునకు బొమ్మ"ని యానతిచ్చెను. పిమ్మట శంకరకవి తనకోరిక నిట్లు దెలిపెను.
శ్లో॥కదా బృందారోగ్యే విపులయముకాతీరపులినె
చరంతం గోవిందుని హలధరధరసుధామాదిసహితం
అహో! కృష్ణస్వామిన్ మధురమురళీమోహనవిభో
ప్రసీదేతి క్రోశ న్నిమిషమిన నేమ్యామి దినసాన్.
తా॥బృందావనమందు విశాలమైన యమునా నదియొక్క యిసుకతిన్నెమీద బలరామాదులతొ గూడి చరించుచున్న గోవిందునిం! దలచుకొని "యేకృష్ణస్వామీ! మధురమురళీమోహనవిభుడా! అనుగ్రహింపుము" అని వేడుకొనుచు దినములను నిమిషములవలె నేనెప్పుడు గడుపుదునోగదా?
అది యాకర్ణించి రాజు "నీవు విరాగివై బృందావనమునకు బొ"మ్మని యానితిచ్చెను. పదపడి కాళిదాసుడు సంతోషవికసితముభావి భోజుడై భోజుని కభిముఖుడై యిట్లనియె:
శ్లో॥కదా కాంతాగారే పరిమళమిళిత్పుష్పశయనే!
శయాన: శ్యామాయా: కుచయుగ మహం నక్షసిన
హర్
అయే స్నిగ్దే ముగ్దే! చటులనయనే! చంద్రవదనే!
ప్రసీదేతికోశ న్నిమిషమిన నేష్యామీ దివసాన్.
తా॥ప్రియురాలి మందిరమందు ఘుమఘుమ పరిమళించుచున్న పూలపానుపుమీద బండుకొని ప్రియురాలిని గౌగలించుకొని "యో కల్యాణీ! యోముగ్దా! యోచంచలనయనా! యోచంద్రముఖీ! యనుగ్రహింపవే" యని వేడుకొనుచు దినములను నిమిషములవలె నేనెప్పుడు గడుపుదునోకదా!