పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

145

కాళిదాస చరిత్ర

బోయి యావిషయమై ప్రసంగింప మొదలుపెట్టిరి. అందు శంజరకవి కాళిదాసునితో నిట్లనొయె.

    “మిత్రమా! మనమీమహారాజును జిరకాలమునుండి యాశ్రయించి యున్నాము. లోకమునందు నిరుపమానమైన ప్రతిష్ఠ సమోఅదియున్నాము. సమస్తగ్రంధములు జదివినాము. ఈశృంగార సమస్యలు పూరించుటలోను మనుష్యమాత్రుడైన యీరాజును స్తనము చేయుటలోను వానియనుగ్రహము సంపాదించుటకు బ్రయత్నము చేయుటలోను కాలము గడుపుచుంటిమి. గాని సకలభువనేశ్వరుడగు బరమేశ్వరునుసేవలలో మనము కాలము గడుపుటలేదు. రాజులమాటలు నీళ్ళలోనిమూటలు, వారియనుగ్రహములు మెఱుపుతీగలవలె జంచలములు. నాకొసంగు నైశ్వర్తములుస్దిరములు అనుగ్రహము వచ్చినప్పుడు కనకాభిషేకము చేయుదురు. అనుగ్రహము వచ్చినప్పుడు శునకమును కొట్టినట్లు కొట్టుదురు. కావున మనమీభూమీశ్వరుని సేవ విడిచి జగదీశ్వరుడైన పరమేశ్వరుని సేవింతము.మనము నలుగురము సన్యసింతుము. మహారాజుగారికడకుబోయి మేము విరాగులమైతిమి, పోవుటకు మాకుసెలవిండని యడుగుదుము ఇది నీకిష్టమగునాకాదా?” 
  ఆమాటలు వినగానే గాళిదాసుడు వారియందు విశ్వాసము లేనివారగుటచే తననిమిత్తము వారేగోయిత్రవ్వుచున్నారేమో యని యనుమానించి యిట్లుతలంచెను. “ వీరు నన్ను జెఱుపుటకై నిశ్చయించి యీపన్నుగడబన్నినారు. ‘శ్యామేత్ ప్రత్యసకారేణనోసకారేణదుర్జన: మనకపకారముచేసినవారికి మరల నపకారము చేసినప్పుడే వారులొంగుదురుగాని, యుపకారమువలనలొంగరు. మాసినబట్ట దౌడుతోనే యుదుకవలయును. మోసగానిని మోసముతోనే జయింపవలయును.వీరుత్రవ్బుకొనినగోతిలోవీరినేబడద్రోసెదనని నిశ్చయించి తానుగూడ సన్యాసము స్వీకరింప సిద్దముగనున్నట్లు వారితో బలికెను.