ఈ పుటను అచ్చుదిద్దలేదు
144
కాళిదాస చరిత్ర
తా॥ సూర్యుడు సముద్రములో బడుచున్నాడు. పర్య గర్బములలో మదించినతుమ్మెద పడుచున్నది. ఉద్యానవనమందలి చెట్లతొఱ్ఱలలో పక్షులు ప్రవేశించు చున్నవి. పడుచుపడతులయందు మెల్లమెల్లగా మన్మధుడు ప్రవేశించుచున్నాడు.
స న్యా స ము
భోజునియాస్ధానమందు
చిరకాలమునుండి
కవిత్వము జెప్పుచు బేరు ప్రఖ్యాతులు గాంచిన దండి భవభూతి శంకరుల కంటే వారితరువాత నెంతోకాలము నకు వచ్చిన కాళిదాసు కఖండ గౌరవము, రాజానుగ్రహము, పలుకుబది కలుగుటచేత నామువ్వురు కవులు చూపొపక కాళిదాసు నెట్లయిన బెదురుపడవలెనని బహుప్రయత్నములు చేసిరిగాని యవి సఫలముగాకపోయెను.అందుచేత వారు గుమి గూడి యాలోచించిరి. అందు శంకరుడిట్లనియె.
"కాళిదాసును రాజసన్నిధానమునుంది పాఱద్రోలుటకు మనముచేసిన యత్నములన్నియు వ్యర్దములైనవి. మనకు గత్యంతరము కనపడలేదు. అతని నీ రాజసభనుండి వెడలుగొట్టుటకు నాకొక్క యుపాయము తోచుచున్నది. అతడు, మనము కలిసి సన్యసించి దేశాంతరమునకుబోవుదము. ఇందువలన మనకేమిలాభమని మీరాలోచించవద్దు. అతనికి లేకపోవుటయే మనకుండుట, లేదా వానిం జంపి మనము చావవలయును. ఈ రెండుపాయములకన వేఱుపాయములు లేవు" అని శంకరకవి పలుక దక్కినవారిద్దఱు "వానిం జంపి తాము జచ్చుటకంటె నందఱు సన్యాసులైపొవుటయే యుభయతారక" మని యంగీకరించిరి. అట్లు కృతనిశ్చయులై వారు కాళిదాసుకడకు