Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
143

కాళిదాస చరిత్ర

బాణునికి గొప్పబహుమానము చేసెను. పండితులందఱు దమతమ గృహముల కరిగిరి. బాణు డాబహుమానధనము తక్కిన పండితులకు బంచి పెట్టక తానొక్కడే గ్రహించుటచేత విద్వాంసులు మత్సరముపూని యా సంగతి రాజుతో విన్నవింపబోయిరి. రాజు వారి మొఱనాలకించి సమస్యాపూరణ మెట్లుజరిగినదని వారి నడిఘి చారణు వలన నది పూరింపబడినదని తెలిసికొని కాళిదాసుదు చారణవేషముతో సమీపముననున్నాడని యూహించి నతని పెట్టెను, బట్టుకొమ్మని సేవకుల కానతిచ్చెను. వారు పట్టణమంతయు వెదకి వేసారి యెందు నతని గనుగొనలేకపోయిరి.ఎట్టకేల కడుగులజాడలంబట్టి విలాసవతీ గృహంబున నున్నాడని యెఱింగి రాజు సపరివారముగా దానిగృహమున కరిగెను. అక్కడ భోజుడు కాళిదాసుని గనుంగొనెను. వారు చిరవిరహ తాపము శమించునట్లు పరస్పర గాఢాలింగనము చేసికొనిరి. ఉభయుల నేత్రములనుండి యానందభాష్పములు స్రవించెను. కాలిదాసుని బాష్పములు భోజమహారాజు స్వహస్తములదుడిసెను. ఆకవిశేఖరుని నృపాలుడు తన గుఱ్ఱముమీద నెక్కించుకొని సపరివారముగా సభామందిరమునకు బోయి యానందసముద్రమున నోలలాడెను.

     ఆనాడు ఎంతో షాతిశయమున భోజక్షమావల్లభుడు పండిత మండలి కీ క్రిందిసమస్య నిచ్చెను.

   శ్లో॥పరిసతతి పయోనిధౌ పతంగ,
  రెండవపారము బాణు డిట్లు పూరించెను.
        నరసింహా ముదరేషు మత్తభృంగ
   మహేశ్వరకవి యిట్లు చదివెను.
        ఉపవనతరుకోటరే విహంగం
     కాళిదాసు డిట్లు పూరించెను.
        యువతి జనేషు శనై శ్శనై రసంగ।