పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

141

కాళిదాస చరిత్ర

కవులు సమావేశమైరి. అప్పుడు బాణుడు వారితో నిట్లనియె “మనము యౌవనమదముచేతను, రాజన్మానముచేతను, స్వల్పవిద్యామదము చేతను, కాళిదాసును వెడలగొట్టించితిమి. సానాన్యవిషయములో మనమందరము కవులమే. విషమస్దితి వచ్చినప్పు డతడొక్మడేకవి. అతనిని వెడలుగొట్టించినఫలము మనమిప్పుడనుభవించుచున్నాము. సానాన్యబ్రాహ్మణుని ద్వేషించిన వమ్శనాశనమగును. కాళీస్వరూపుని ద్వేషించిన విద్వత్కులమే నాశనమగును” అనిబాణుడు పలుక వారొండొరులతో గలహించిరి. మయూరుడు వజ్రికలహమువారించి యిట్లుపలికెను— “నేటితో మనకు గడువుముగిసినది.కాళిదాసు లేడుగనుక సమస్యాపూరణమునకు సమర్దులులేరు. కాబట్టి మనము నేటిరేయి చర్చిదాస్తమయము కాగానే పట్టణము విడిచి పోవుదము. పోకపోతిమా తాజసేవకులు బలవంతముగా మనలను మెడబట్టి గంటి పంపివేయుదురు. కాబట్టి యీశరీరముతో మెల్లగా నావలకుదాటుట మంచిది. మీకిష్టమైనయెడల నిట్లుచేయుదము“ అతని యుపదేశ మంత అంగీకరించి గృహములకుబోయి సామనులెడ్లబండ్లమీద వైవి యర్దరాత్రిమూరువిడిచి పోయిరి.

   కాళిదాసుడు లీలావతీ మందిరముయొక్క విద్యానవనమందుండి పారిపోవుచున్న యజ్కవుల కంఠస్వరముల గుర్తుపట్టి పరిచారికల బిలిచి వారెవ్వరో కనుగొమ్మని పంపెను. అదివారిం జూచి పోయి “బాణమయురాదులు పలాయతు లగుచున్నా“ రని తెలిపెను. ఆమాటలువిని కాళిదాసుడు వారినెట్లయున రక్షింపవలెనని బట్టలు తెమ్మని పరిచజ్రిక కజ్ఝాపించెను. అదితెచ్వితిచ్చిటయు, నతడు చారణవేషముధరించి ఖడ్గము చేతబూని యుత్తరముఖముగ బైలుదేఱి యంక్రోసులదూరము నడచి వారిం గలసికొని చారణభషతో వారికిట్లనెను— “ఓవిద్యా సముద్రులారా! భోజసభయందు గడుగౌరవము