Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప లా య న ము

భోజభూపాలుని సభ

కాళిదాసుడు లేక

పోవుటచే చంద్రుడులేని రాత్రివలె, సూర్య్లుడులేని దిస లక్ష్మివలె బర్తృవియోగముజెందిన కాంతవలె, నింద్రుడులేని దేవసభవలె, గళాహీనమై యుండెను. అది మొదలుకొని యెవనినోటను సరసమైన శ్లోకము వెడలలేదు. ఎవరిముఖమున రసవంతమైన కావ్యము జనింపలేదు. వినోదకరములైన సంభాషణములులెవు., చమత్కారములుగల సమస్యలులేవు. అట్లు కొన్ని దినములు గతించినపిదప రాజొకనాటిరేయి పూర్ణ చంద్రమండలమును జూచి లీలావతీదేవియొక్క ముఖ బింబమునుజూచి యిట్లు ప్రాకృతభాషలో పలికెను.

"తుళణం అఖ అంఇపరై గ్లౌ మహాచందస్ససొషు ఏదాన్ "

తా॥పూర్ణచంద్రమండలమునకు నేత్రములెక్కడివి? మాటలెక్కడివి? అనంగా చందమామ దేవముఖమును నొక వేళ బోలియున్నను, దేవికున్నట్లు కన్నులులేవు. సరసమైనమాటలు లేవు. అందుచేత దేవిముఖమే చంద్రమండలము కంటె శొభావంతమైనదని భావము.

  అతడు మఱునాడుదయమున గాలకృత్యములు దీర్చికొని సభకేగి యాసమస్య్లను పూరింపుమని విద్యద్బృందమునకిచ్చి "ఈ సమస్యను మీరు పూరింపజాలనిపక్షమున నాదేశమును విడిచి పోవలయును" అని కఠినముగా బలికెన్. కవులు సమస్యను దీసికొని బీతచేతస్కులై తమతమ గృహముల కరిగిరి. 
     వాని యర్ధము దెలిసికొనుటకై వారు చాలతడవు విచారించిరి గాని, భోధపడలేదు అందఱుగలసి యేదో యాలోచనచేసి బాణని రాజుకడకుబంపిరి. అతడు రాజును సమీపించి వారముదినములు గడువియ్య వలసినదనియు, గడువులోపల సమస్య పూరింపని యెడల దేశము విడిచిపెట్టి తాము పోవనిశ్ఛయింప బడినదనియు జెప్పెను. రాజందుకు సమ్మతించెను. ఎనిమిదిదినములు గడిచెను. ఎనిమిదవనాతి రాత్రి