పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

139

కాళిదాస చరిత్ర

  దేవి యట్లడుగ  భోజుడు తనమనంబునగల యావద్వృత్తాంతం నామెతో జెప్పెను. తనమీది యనుమానముచేతనె భర్త కాళిదాసును వెడలగొట్టెనని చ్విని దేవి యాశ్చర్యపడి యిట్లనియె  "దేవా ! మీవంటి భర్త దొరకుటచే నిశ్చయముగా నేను ధన్యురాలను. మీ సహవాస మింతకాలము చేసినతరువాత నా మనస్సు పరునిమీది కెట్లుపోవును? మీచక్కదనముచేత మీరెల్ల పడతుల మనసులందు నుండదగినవారు. నేను పతివ్రతనో కానో మీరిప్పుడు నిర్ణయింపకపోయిన పక్షమున మరణించెదను" అనవుడు రాజు మంచిది యట్లేచేసెదనని త్రాచుపాముతో నున్న కుండను, నెఱ్ఱగాకాలిన యినుపగుండును, బాణమెక్కుపెట్టబడిన విల్లును దెప్పించెను. అప్పుడు దేవి స్నానముచేసి తన పాతివ్రత్యమహాగ్నిచేత దేదీప్యమానముగా వెలుగుచు సూర్యమండల కభిముఖియై "ఓ జగన్మితమా! భగవానుడా! సూర్యుడా! నీవుసర్వసాక్షివి. మేలుకొన్నప్పుడు, నిద్రించునప్పుడు, కలగన్నప్పుడు సయితము భోజుడే నాకుభర్త, నామనసునం దన్యపురుషుని నిలిపియెఱుగ" నని గంభీరముగాబలికి త్రాచుపామును ముద్దుపెట్టుకొని, కాలిన యినుపగుండు చేతబట్టుకొని, బాణ మెక్కుపెట్టిన విల్లుతొ  దన్నుగొట్టుకొనెను. ఆమెను సర్పము కఱువలేదు, అగ్నిహోత్రుడామెచేతిని గాల్చలేదు. భాణఘాతమున నామెకు గాయముకాలేదు. అట్లు దివ్య ప్రమాణములను మూడింటిని జేసి చెక్కుచెదరక పుటమునెట్టిన పుత్తడిబొమ్మవలె నిలిచియున్న లీలావతీదేవిని జూచి రాజు సిగ్గుపడి పశ్చాత్తాపము నొంది నిష్కారణముగా మహాకవిని వెడలుగొట్టి నందుకు మిక్కిలి విచారించెను. కాళిదాసు విరహమును సహింపలేక నిద్రాహారములు మాని యెప్పటి యట్ల మంత్రిసామంతులతొ మాటలాడక రాజ్య వ్యాపారములను జూచుకొనక చింతిల్లుచుండెను.