ఈ పుటను అచ్చుదిద్దలేదు
138
కాళిదాస చరిత్ర
“ఓ ప్రియురాలా! నాకునుౙ్నయిమ్ము, భోజునకు నామీద మహాకోపము వచ్చినది. తనదేశమునుండి నన్నుబొమ్మని సెలవిచ్చెను. ఇకనేనిచ్చట నాలస్యము చేయరాదు. ఇదియంతయు నామీద నెర్ష్య వహించిన పండితుల దౌర్జన్యమని తోచుచున్నది. కానున్నది కాకమానద్య్గదా! బలహీనులైనను పదిమందిచేరి యాలోచించినచో వారినిగెలుచుట కష్టము. గడ్డిపోచలు పేని నెంటిగా జేసిన పక్షమున నది యేనుగులనైనను బంధించునుగదా“
ఆ పలుకులు విని వేశ్యయైన విలాసవతి కాళిదాసున కిట్లనియె. “ఓనాధా!నేనుబ్రతికియుండగా మీకు రాజుతో బనియేమి? రాజుగారిచ్చిన ధనము మీకక్కఱలేదు. మీరునాయింటనే యెవ్వరకు గనబడకుండ లోపలిభాగములో నుండుడుకాని దేశములపాలైపోవలదు“ ఆప్రియురాలి యుపదేశము ప్రకారము కాళిదాసు దానిగృహముననే యుండి యెవ్వరికిం గనపడకుండ గాలక్షేపము చేయుచుండెను.
కాళిదాసుడు రాజగృహము వెడలిపోయినతరువాత లీలావతీదేవి యిట్లనియె, “దేవా! కాళిదాస మహాకవితో మీకు గాఢమైత్రి కలదుగదా! అట్టి చిరమిత్రుని మీరేల దేశమునుండి వెడలగొట్టిరి? ఈ యనుచితార్య మేలచేయువలసె? చెఱుకుగఱ్ఱ కణుపు కణుపునకు దియ్యగా నుండునట్లు సజ్జనమైత్రి సర్వధా హితముచేయుచుండును. దుర్జనులమైత్రి దీనికివిప్రీతముగా నుండును
శ్లో॥శోకారాతిపవిత్రాణాం, ప్రీతివిసంభభాజనం,
కేర రత్న మిదం స్పష్టం మిత్ర మిత్యక్షరధ్యయం.
తా॥ దు:ఖమనెడి శత్రువునుండి రక్షించునది, విశ్వాసమునకు బాత్రమైనది, శ్రేష్టమైనదియైన ‘మిత్ర ‘ మను పదమునందలి రెండక్షరముల నెవడు కల్పించెనోగదా? “