ఈ పుటను అచ్చుదిద్దలేదు
137
కాళిదాసు చరిత్ర
శ్లో॥ముద్గనాళీ గదవ్యాళీ కనీం ది వితుషా కధం,
తా॥కవిశేఖరా! రోగమునకు సర్పమువంటిదైన పెసరపప్పుపొట్టు లేకున్నదేమి?
దేవీసమీపమందున్నను సరకుచేయక కాళిదాసుడు పైశ్లోకముయొక్క యుత్తరార్ద మిట్లు పూరించెను.
అంధోవల్లభసయోగే జాతా విగతకంచుకా.
తా॥ అన్నమనుభర్తను గూడుచున్నదిగనుక పెసతపప్పుఱవికను దీసివైచెను.
లీలావతీదేవి యపరశారదవలె విద్వాంసురాలగుటచే శ్లోకార్దమును గ్రహించి మందహాసముచేసి తలవంచుకొని ప్రక్కగా నిలిచెను. అది కనిపెట్టి రాజు తనమనంబున నిట్లు విచారించెను. “ఈమె కాళిదాసుతో నిశ్చయముగా మైత్రి గలిగియున్నది. అందుచేతనే యీమె సమీపమందున్నదనియైనశంకింపక యితడు మోటమాటలతో శ్లోకార్దము పూరించెను. ఈమెగూఅడ నామాటలు విని సిగ్గుపడక చిఱునవ్వు నవ్వినది. స్త్రీలచరిత్ర మెచ్చడెఱుగును?
శ్లో॥అశ్వప్లుతం, వాసగర్జితంచ, స్త్రీణాంచచిత్తం, పురుషస్యభగ్యం
అవర్షణం దా, స్యతివర్షంచ, దేవో సజానాతి,కుతోమనుష్య।
తా॥గుఱ్ఱపునడక, మేఘగర్జనము, స్త్రీలయొక్కచిత్తము, పురుషుని భాగ్యము, అతివృష్టి, అనావృష్టి దేవతలైనను దెలిసికొనలేరు. ఇంక మనుష్యులకు దెలియునా?
ఈతడు బ్రాహ్మణుడుకావున దజ్రుణాపరాధము చేసినను వీనిం జంప గూడదు. అదియునుగాక యితడు సరస్వతీదేవియొక్క యవతారము. “అని విచారించి మహారాజు కాళిదాసునుజూచి “ఓ కవీ! నీవిక నాదేశమందుండవలదు. మాఱుపలక వెంటనే లేచిపొమ్మని యస్నతిచ్చెను. తక్షణమే కాళిదాసుడులేచిరాజుసన్నిధిని విడిచి నిజవేశ్యా గృహంబునకు జని దానితో నిట్లనియె—