ఈ పుటను అచ్చుదిద్దలేదు
130
కాళిదాస చరిత్ర
తీర్పవలయును. తెల్లవారుచున్నప్పడు కాకులు ‘కా కా ‘ యని యేల యఱచునో చెప్పవలె “ననియడిగెను. ఆప్రశ్నమును విని డక్కాకవి “తనకది తెలియ“దని చెప్పెను. అనవుడు కాళిదాసుడు “ఫోనిండుబాబూ! నాకుతెలిసినది చెప్పెదవినండి“ అని యీక్రిందిశ్లోకము జదివెను.
శ్లో॥నయం కాకా నయం కాకా: కింకటంతీతి నాయనా:
తిమిరారిస్తమోహంతి శంకయాతంకమాససా।
తా॥కాకులు కాకాయని యెందుకఱచుచున్నవనగా సూర్యుడు చీకటులను నాశనముచేయుచున్నాడు. మేముగూడ నల్లగా నుండుట చేత జీకటులనుకొని మమ్ముగూడ నాశనముచేయునేమో యనుభయమున ‘మేము చీకటులముకాము. మేము కాకులము, కాకులము. మాజోలికి రావలదు ‘ అనిసూర్యునిగూర్చి మొఱవెట్టుకొనుచున్నవి.
ఆశ్లోకమువిని ఢక్కాకవి “ధారానగరమందలి కూలొవాండ్రుసైత మట్టి పండితులైనప్పుడు కాళిదాసునివంటి మహాపండితునితో వాదము వేయుట దుర్లభ“ మని రహస్యముగా నాయూరు విడచి స్వదేశమునకు బోయి మరలశాస్త్రములన్నియు గట్టిగాజదువుకొని తప్పక కాళిదాసును జయింపవలెనని నిశ్చయించుకొని సరస్వతి నుపాసించి మరల ధారానగర మునకు బోయెను. ఆసంగతివిని కాళిదాసు వెనుకటియట్లే ప్రచ్చంబవేషముతో నతని నెదుర్కొనవలెనని గుఱ్ఱములు కాయువానివేషము వేసికొని తలమీద గడ్డిమోపుపెట్టుకొని ఢక్కాకవి దర్శ్నమునకుబోయి కూర్చుండ ఢక్కాకవి ప్రాత:కాల వర్ణనము చేయదలంచి యస్తమించుచున్న చంద్రునిగురించి యీక్రింది శ్లోకభాగము రచొంచెను.
శ్లో॥చరమగిరి కురంగీ శృంగకండూయనేన
స్వపితి సుఖ మిదానీ మంతరిందో:కురంగ।
తా॥చంద్రునిలోనున్న మగలేడి పడమటికొండమీదనున్న యాడులేడి కొమ్ములతో గోకుటచేతనిప్పుడు సుఖముగానిద్రించుచున్నది.