129
కాళిదాస చరిత్ర
శ్లో॥భిక్షా మట న్నత్రాగత: ప్రక్షాళయ న్నాశాస్మితై:
ఆదాయ యో మేమానసం గోదావరీతీరం గత:
సన్యాసినం భూయోసితం ధన్యాకృతిం పశ్యామిచేత్
సారాదశా వైతంతనీ నజ్రాయణా, నారాయణా.
తా॥ ఓనారయణా! నజ్రాయణా! ఏసన్యాసి బిచ్చమెత్తుకొనుచు వచ్చి తన చిఱునవ్వులచేత పలుదిక్కులను బ్రకాశింపజేసి నస్మనస్సును వశపఱచుకొని గోదావరీతీరమునకు బోయెనో, సుందరుడైన యాసన్యాసిని మరల జూచెడుభాగ్యముగలుగెనేని నావితంతుదశ శ్రేష్టమైంస దగును.
ఆశ్లోకమువిని సభవారందఱు బకబక నవ్విరి. శ్లోసందర్భమంతయు భోజరాజు సభ్యుల కెఱిగించెని.
ఢ క్మా క వి వి జ యం
ఒక మహాకవి సరస్వతీదేవి
నారాధించి యామె యనుగ్రహ
మున నొకఢక్కాసంపాదించెను. అది నాయింపగానే యతనితో వాదమునకు వచ్చిన పండితులనోరు పడిపోవును. అందుచేత నతడు “డక్కాకవి“ యని ప్రసిద్ధి జెందెను. దానితో నతడు బహుదేశములు సంచరించి సకల రాజాస్దానపండితుల జయించి ధారానగరమున భోజుని యాస్దానమున పుంభానసరస్వతియని పేరువడసిన కాళిదాసుడను నొకమహాకవి యున్నాడని విని, యతనిం జయింపవలెనని ధారాపురమునకు బోయి యొకసత్రమున బసచేసెను. ఆవార్తవిని కాళిదాసుడు “పండితులతో వాదమునకు బోయినయెడల నతడు డక్కా వాయించి వాగ్భంధనముచేయు“నని భయపడి కూలివానివేషము వేసికొని యాకవికడకు బోయి కొంతసేపు మాటడి “మహానుభావా! మాకన్నిసంగతులు తెలియును. నాకొక సందేహమున్నది. మీరే