ఈ పుటను అచ్చుదిద్దలేదు
బా ల వి తం తు వు
ధారానగరమున నొక బాల
వితంతువుండెను. ఆయువతి
నొకసన్యాది భిక్షాటనముచేత జీవించును నీవితంతువుయొక్క గృహమందు బససేసెను. ఆమె సన్యాసివలన మొట్టమొదట వేదాంతము వినగోరి యాతనిశుశ్రూషచేసెను. క్రమక్రమముగా శ్రుశ్రూష మైత్రిగా పరిణమించెను. ఆమైత్రివారినివివాహముకానిదంపతులుగామార్చెను. ఆవార్త పట్టణమంతట పొక్కెను. జనులు విపరీతముగా జెప్పుకొనిజొచ్చిరి. ఆనొటనుండియానోటనుండి యామాట భోజపాలుని చెవింబడెను. తన పట్టణమున నట్టియకార్యకరణము జరుగుచున్నదని విని రాజు కోపించి యాకపట పరివ్రాజకుని దేశమునుండి పాఱద్రోలెను. అతడు వియోగము సహింపక యాబాలవితంతు నిట్లు ప్రతిదినము విచారింపజొచ్చెను:
“నాకనుల చందమామ నారాయణా
నన్నెడబాసెనోయి నారజ్యణా
నాకింక గతియేమి నారాయణా
సన్యాసినిజూపవోయి నారాయణా
నాప్రాణములు నిలుపవోయి నారాయణా
నన్ను రక్షింపవోయి నజ్రాయణా
నాకాతడేదిక్కు నారాయణా“
అనిసన్యాసిమీద ప్రేమచేతనైననునిత్యము నారాయణస్మరణ చేయు ఉండెను.
భోజుడు ప్రచ్చన్నవేషముతో నగరమున దిరుగుచు బాలవితంతువు నివసించుచున్న వీధికిబోయి యామెయేడుపు విని మఱునాడు సభామండపమునగూర్చుండి “నారాయణా, నారాయణా“ యను సమస్యనిచ్చి కవులం బూరింపుమనెను. కళీదాసు డిట్లుపూరించెను: