ఈ పుటను అచ్చుదిద్దలేదు
127
కాళిదాస చరిత్ర
వెఱ్ఱివాడు కాకికూతకు భార్య నిజముగా జడిసినదని వగచుచున్నాడు. ఈమె యెంతకైనను సాహసురాలని తోచుచున్నది. ఈరాత్రి యిచ్చటనే యుండి యీమెచర్యలు గనిపెట్టెద" అని నిశ్చయించుకొని యా రాత్రి యచ్చటనే యుండెను.
ఆ యిల్లాలు రాత్రి భర్తకు భోజనముపెట్టి పండుకొన బెట్టి నిద్రపట్టినదాక పాదములొత్తి తరువాత, దలుపులు వైచి తన దూతికను బిలుచుకొనివచ్చి దానిచేత గొంత మాంసము దెప్పించి నర్మదానది యొడ్డునకుబోయి యొక తెప్పపై నెక్కి మొసళ్లుమొదలైనవి తామీదికి రాకుండ దూతిక తెచ్చిన మాంసఖండములు వాని కెఱవైచి దూతికతొ గూడి నది కావలియొడ్డుననున్న తన మనోహరుని గలసికొని యారాత్రి యతనితో సుఖముగా గాలక్షేపముచేయుటకుబోయి తెల్లవారు జాముఇన నదేవిధముగా మరల నిల్లుజేరెను.
ఈ సంగతినంతయు భోజరాజు కనిపెట్టి ధారానగరమునకు వచ్చినతరువాత నాస్ధానకవులు జూచి "దివా కాకరుతా ద్భీతా"(పగలు కాకికి భయపడుచున్నది) యను సమస్యనిచ్చి పూరింపు మనెను., తక్కినకవులు సందర్భము తెలియక యూరకుండిరి. కాళిదాసుడు "రాత్రౌ తరతి నర్మదం" అని (రాత్రి నర్మదను దాటుచున్నది) రెండవపదమును పూరించెను. సంతోషించి రాజు "తత్రసంతి జలే గ్రాహా" (ఆచీకట్లో మొసళ్లున్నవి) అని మూడవపాదం తానూ పూరించెను., అప్పుడు కాళిదాసుడు "మర్మజ్ఞా సైవ సుందరీ" (ఆ సుందరాంగి దాఇకిదగిఅ యుపాయ మెఱుగును) యని నాల్గవ పాదము పూరించెను. మొత్తముమీద శ్లోకమిది:
శ్లో॥ దివా కాకరుతాద్భీతా, రాత్రౌ తరతి నర్మదాం
తత్ర సంతి జలే గ్రాహాం; మర్మజ్ఞా సైవ సుందరీ