కాళిదాస చరిత్ర
ఈశ్లోకము చదువగానే కాపాలికుండు చైతన్యము గలిగి దిగ్గునలేచి నిలిచి కాళిదాసునకు నమస్కరించెను. కాళిదాసు వానిం గౌంగలించుకొని "రాజా! యెంతపని చేసితిని. నీమరణవర్ణనము నానోట వినగొరి మాఱువేషము వైచుకొని వచ్చితివా? చాలుచాలు దైవ యోగమున మరల బదికితిని" యని మందలించెను. భోజుడు కాళిదాసుని వెంటెబెట్టుకొని ధారానగరమునకు బోయెను.
కా కి కూ త కు భ య ప డి న స్త్రీ
భోజుడు ప్రచ్చన్నుడై దేశమందు
దిరుగుచు నొకనాడు నర్మదానదీతీరమునం
దున్న యొకగ్రామముజేరి మద్యాహ్మకాలమున నొక బ్రాహ్మణుని యరుగు మీద గూర్చుండెను. ఆ బ్ర్రాహ్మణుడు వృద్ధుడు. నియమంతుడు. మధ్యాహ్నకాలమున నతడు వైశ్వదేవము చేసికొని కాకుల కన్నము వైచెను. అన్నము జూచినతొడనే 'కావు కావు ' మని యెన్నో కాకులక్కడ జేరెను. కొన్నికాకులు శ్రుతికటువుగా నరచెను. పూర్ణయౌనములో నున్న బ్ర్రాహ్మణుని భార్య కాకుల కూత విని చెవులు మూసికొని "అమ్మో" యని గుండె చఱచుకొని నేలంగూర్చుండెను. "భయకారణ మేమి" యని భర్తయడిగెను. "అయ్యో ! కాకికూతలు కర్ణకఠోరముగానున్నవి. నేను వాటినివిని సహింప జాలను. భయమువేయుచున్నది. ఊరక చూచు చున్నారేమి?వచ్చి నన్ను గౌగలించుకొనుడు" అని భార్య పలికెను. పాపము భార్య్ల భయపడుచున్నదని యావృద్ధబ్రాహ్మణుడు భార్యవీపుపై దట్టి గట్టిగా గౌగలించుకొనెను. ఇదియంతయు భోజరాజు కనిపెట్టి తనలో నిట్లనుకొనెను-- "ప్రపంచమునం దింతమంది యాడువాండ్రను జూచితినిగాని యీమెవంటిదానిని జూడలేదు. ఈబ్రాహ్మణుడు వట్టి