ఈ పుటను అచ్చుదిద్దలేదు
17]
123
కాళిదాస చరిత్ర
మెట్లుగలిగె" నని కాళిదాసు ప్రశ్నించెను. ఆ ప్రశ్నకుత్తర ముగా గాపాలికుడు "దేవా! ఏమని విన్నవింతును. కొలదిదినములక్రిందటనే భోజరాజు స్వర్గస్ధుడైయ్యె" నని గద్గదస్వరముతొ బలికెను. అదివిని కాళిదాసుడు మూర్చిల్లి కొంతవడికి తెలివితెచ్చుకొని "హా! భోజరాజా! హా! మధ్యమలోక మందారమా, హా! కవిజనకల్పకమా, హా! పండితజన పారిజాతమా, నీకు మరణమాసన్నమగుటచేతనే నీమరణము వర్ణింపుమని నన్నుగొరితివి. "వినాశకాలె విపరీతబుద్ధి;" అనుమాట నిజమైనదీ యని విచారించి తక్షణమే యీక్రిందిశ్లోకము రచియించి చదివెను:
శ్లో॥ అద్య ధారా నిరాధారా, నిరాలంబా సరస్వతి,
పండితా: ఖందికా; సర్వే, భోజరాజే దివంగతే.
తా॥భోజరాజు స్వర్గస్దుడగుటచేత నేడు ధారాపట్టణము నిరాధారము. సరస్వతి యాలయము లేనిదయ్యెను. పందితుల యాశలు భగ్నములయ్యెను.
ఆ శ్లోకము కవినొటనుండి రాగానే కాపాలికుడు నిశ్చేష్టితుడై నేలబడియెను. అది చూచి కాళిదాసు డక్కజపడి దీపము దెప్పించి చూడ నతడు భోజరాజయ్యెను. "అయ్యో! పండితవాక్యము రిత్తవొవ దన్నమటా నిజూము. భోజరాజు మృతుడయ్యెనని నానోట వెడలుటచే నతడు నిష్కారణముగా మృతుడయ్యెనే ! అయ్యో! నాపొషకుడైన మహారాజును నేనే చంపుకొంటినె" యని విచారించి వెంటనే శ్లొకము మార్చి యిట్లు చదివెను.
శ్లో॥ అధ్యధారా సదాధారా, సదాలంబ సరస్వతీ,
పండితా మండ్తా; సర్వే, భోజరాజే భువంగతేౠ
తా॥ భోజరాజు భూమిని బాలిచుటచే నేడు ధారానగరము మంచి యాధారము గలది. సరస్వతి మంచి మంచి యాలయము కలది. పండిలందఱు గౌరవింపబడుచున్నారు.