కాళిదాసు చరిత్ర
వియోగము సహింపజాలక మరల రమ్మని బ్రతిమాలును. వానికడకు దూతలనంపి తన కడకు రప్పించుకొనెను.
మ ర ణ వ ర్ణ న ము
భోజకాళిదాసు లొకనాడు
పువ్వులతోటలో గూర్చుండి
యిష్టాగోష్టిమై వర్ధిల్లుచుండ రాజు కవింజూచి యిట్లనియె “మిత్రుడా! నన్ను స్త్రోత్రముచేయుచు, నాకీర్తి వర్ణించుచు నీవనేకశ్లోకములు చెప్పితివి. అవన్నియు నాకు మిక్కిలి ప్రీతిగాంచినవి. నాకొకకోరికకలదు. కాదనక నీవది తీర్పవలయును. నేను మరణమొందినతరువాత ధారానగర మెట్లుండునో నీనోట వినవలెననియున్నది. అదిచెప్పి నన్నుధన్యుని చేయుము“ అన వెంటనే కాళిదాసుడు కోపించి “రాజా! ఇది యేటికోరిక కుడిచి గూర్చుండలేక మరణవర్ణనము కోరదగునా! నీయన్నముదినుచు నీవు జీవించియుండగా నీమరణము వర్ణనము చేయుటకు నాకు నోరెట్లాడును? నేనట్లు చేయజాల“ నని బదులు చెప్పెను. అప్పుడు రాజు మహాగ్రహము గలిగి కాళిదాసు నావలకు బొమ్మనెను. ఆ మహాకవి తానుంచుకొన్న విలాఆవతియను వేశ్యతో గలసి యేగశిలానగరమునకుబోయి యచ్చట నివసించెని
భోజుదు తనమనోరధ మీరేడలేదని విచారించి కాళిదాసుడున్నచోట తానుచారులవలన నెఱిగి కాపాలికవేషము దాలిచి యేకశిలానగరమునకరిగి రాత్రివేళ గాళిదాసుడున్న గృహమునకుబోయి శంఖాశాస్త్రోక్తమైనప్రకారము శంఖమును బూరించెను. “ శాస్త్రోక్తముగా శంఖనాదము చేసినవాడెవ”డని కాళిదాసుడు వీధిగుమ్మములోనికి వచ్చి యడుగ నతడు కంఠమునుమార్చి “స్వామీ! నేను కాపాలికుడను. ధారానగరవాసుడ“ ననిచెప్పెను. “భోజరాజు పరిపాలించుచుండగా ధారానగరవాసులు బిచ్చమెత్తుకొనవలసిన యవసర