పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
120

కాళిదాస చరిత్ర

జేసెను. నాల్గవజామున దానవుడు తిరిగివచ్చి "స్త్రీపుంనచ్చ" యనుసూత్రమును బఠించెను. కవిసార్వభౌముడు "ప్రచరతి గృహేతద్దిగేహం వినష్టం" అని పూరించెను., నాల్గుజాములయందు ను దన యభిప్రాయము కాళిదాసుడు సరిగాజెప్పుటచేత రాక్షసుడు మిక్కిలి సంతసించి ప్రభాతసమయమున గాళిదాసును గౌగలించుకొని "మిత్రుడా ! నీబుద్దివిశేషమునకు నేను మెచ్చితిని. కావలసిన వరమునిచ్చెద కోరుము" అని సాదరముగా బలికెను. నావుడు కాళిదాసుండిట్లనియె , "నీవరములు నాకక్కఱలేదు. రాజుగాగా రెంతో మనసుపడి యీ గృహమును గట్టించుకొన్నారు. దీనిని నీవు విడిచిపోఉయితివా వేయివరములిచ్చినట్లే" యని బదులు చెప్పెను. రాక్షసుడు మంచిదని యా భవనమును విడిచి పోయెను. రాజు మహానందభరితు చేతస్కుడై లోకోత్తర చరిత్రుడగు కాళిదాసును మిక్కిలి గౌరవించెను.

శ్లోకము పూర్తియైనతరువాత నీక్రిందివిధముగా నున్నది---

శ్లో॥'సర్వస్య ద్వే ' సుమతీకుమతీ సంపదాపత్తి
     హేతూ
     'వృద్భోయానా ' సహ పరిచయాత్ త్యజ్యతే
     కామినీభి:
     'ఏకోగోత్రే ' ప్రభవతి పుమాన్ య; కుటుంబం
     బిభర్తి
     'స్త్రీ పుంస చ్చ ' ప్రచిరతి గృహే తద్దిగేహం
      పినష్టం .

   ఇందులో మొదటి నాలుగుసూత్రములకు వ్యాకరణ సంబంధమైన యర్దమువేఱు. వాటికే లోకసంబంధమైన యర్దములుగలవు. ఈ రెండవ యర్దము నుబట్టియే కాళిదాసుడు పాదపూరణము చేసెను.
     తా॥అందఱికి సంపదకు హేతువైన మంచి బుద్దియు,నాపదకు హేతువైన చేడ్డబుద్దియునని రెండుండును. పడుచువానితొ బరిచయమును గలిగిన స్త్రీచేత వృద్దుడు విడువబడును. ఏ పురుషుడు కుటుంబమును భరించి పోషించునొ యతడొక్కడే గోత్రమందు  బుట్టినవాడు. ఏ స్త్రె మగవానివలె సంచరించునో యాగృహము నశించును.