119
కాళిదాస చరిత్ర
ప్రవేశముచేసి కూర్చుండెను. ఆ రా క్ష సు డు రాత్రికాలమున నాగృహమున నెవ్వడువసించునో వానికడకుబోయి పాణినిరచియించిన వ్యాకరణశాస్త్రమందలి సూత్రములు నాలుగుజాములకు నాలుగు చదివి వానికి దగిన సమాధాన మిమ్మనికోరును. అతను కోరినప్రకారము సమాధానము చెప్పలేనివారిని జంపి భక్షించుచుండును. రాజు మంత్రశాస్త్రప్రవీణులైన యుత్తమబ్రాహ్మణులనుబిలిపించి రాక్షసోచ్చాటనము కొఱకు సకలప్తయత్నము చేసెను. ఆరక్కసుడు మంత్రించి యిచ్చిన మహాబ్రాహ్మణులను సయితము భక్షించి కడుపు నిండినతరువాత మునుపు దనకువచ్చియుండిన శ్లోకములంజదువుకొనుచు గూర్చుండును. చిట్టచివరకాయిల్లు భోజునకు వదలివేయవలసివచ్చెను. కడపటి ప్రయత్నము చేయుదమని కాళిదాసును బిలిచి యావృత్తాంతమతనితో జెప్పెను. కాళిదాసు డది విని “రజా ! ఈబ్రహ్మరాక్షసుడు సలలశాస్త్ర పమీతుడు పైగా సత్కవి. ఎట్లైనను వానిని సంతోషపఱచి నేనీగృహమునుండి వానిని వడలగిట్టెదను. ఆమాంత్రికులను బంపివేయుడు. నామంత్రము జిత్తగింపుడు“ అని మనవిచేసి యారాత్రి తానామందిరమున కరిగి పండుకొనెను.
రాక్షసుడు యధాప్రకారముగా గాళిదాసున్నచోటికిబోయి మొదటిజామునపారసీవ్యాకరణములోని “సర్వస్యద్వే” యను సూత్రమును జదివెను. కాళిదాసుడు వెంటనే “సుసుమతీశుమతీ సంపదాపత్తి హేతూ“ అని యాపాదము బూరించెని. రక్కసుడు రెండవజామున మరలవచ్చి “వృద్ధో యూనా“ యనుసూత్రము పఠించెను. తక్సణమే కాళిదాసుడు “సహ పరిచయాత్ త్యజ్యతే కామినీభిం“ అని పూర్తిచేసెను. మూడవజామున నాదైత్యుడు వెండియు వచ్చి “ఏకొ గోత్రే“ తనుసూత్రమును జదివెను.అనంతరము మహాకవి “ప్రభవతి పుమాన్ య: కుటుంబం బిభర్తి” అనిపాదము సమగ్రము