Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

115

కాళిదాస చరిత్ర

 అంతట రాజు మిక్కిలి యక్కజమునొంది యాస్దాన కవీశ్వరులను మంత్రిసామంతులను బిలిపించి యా వృత్తాంతమంతయు నెఱిగించెన్. అనంతరము కాళిదాసుడు నాల్గవచరణ మిట్లు పూరించెను

"స్నిగ్ధ ముష్ణంచ భోజనం"

   తా॥భోజనము స్నిగ్దముగాను, నుష్ణముగాను నుండవలెను. అనగా, చక్కని వేడియన్నము దినవలెనని దీని భావము.
     అదివిని భోజరేఅజు కాళిదాసుడు సామాన్య మనుష్యుడు కదనియు, లీలామానుష స్వరూపుడనియు నమ్మిమిక్కిలి గౌరవిచెను. పిమ్మట భోజరాజు సరిగా నిద్రపోవుచు నాకలిగలిగి భుజించుచు శుక్లపక్ష చంద్రుడువోలె దినదినప్రవర్దమానుడై యెప్పటి యారోగ్యస్దితింజెందెను.

చంద్రబింబ వర్ణనము

ఒకనాడు భోజుడు వేటకై

వనమునకరిగి మిక్కిలి యాయాస

పడి యొక చెఱువుగట్టున గూర్చుండి యచ్చటిచెట్ల చల్లగాలి ననుభవించుచుండెను. అంతట గ్రమక్రమముగా సాయంకాలమగును. భానుడు పశ్చిమాద్రిశృంగము నలంకరించెను. వెన్నముద్దవలె జందమామ యాకాశమున నుదయించెను. పండు వెన్నెల కాయజొచ్చెను. మిక్కిలి చల్లనై పరమ్మనంద జనకమైన యా వెన్నెలను విడిచిపెట్టలేక భోజుడచ్చటనే యారాత్రిగడప నిశ్చయించి సుఖనిద్ర జెంది తెల్లవాఱునప్పుడు మేల్కొని పడమటి కొండవైపున వ్రేలుచున్న చంద్రునిజూచి ప్రకృతి సౌందర్యమునకు మిక్కిలి సంతసించి మరల నగరమునకరిగి సభాసీనుడై పండితుల కీ క్రింది సమస్య నిచ్చెను:--

    శ్లో॥"చరమగిరినితంబే చంద్రబింబం లలంరే"