Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
108

కాళిదాస చరిత్ర

   భోజ: చౌర్యద్యూతపరిశ్రమోర్తి భవతాం ? చౌర్యద్యూత ములయందు గూడ మీకు పరిశ్రమముకలదా?
   భిక్షు: భ్రష్టవ్యల్కావాగతి = చెడిపోయినవానికి వేఱుగతేమున్నది.

ఆశ్లోకము మీక్రిందివిధముగా నున్నది:--

శ్లో॥భిక్షో! మాంసనిషేనణం కిముచితం? కిం తేన మధ్యం
     నినా
     మధ్యంవారి తనప్రియం? ప్రియమహో వారాంగనా
     ధిస్సహ
     వారస్త్రీరతయే శుత న్తనధనం ? చౌర్యేణ ద్యూశేనవా
     చౌర్యద్యూతపరిశ్రమోప్తి భవతాం? భ్రష్టస్యకావాగతేం

      భిక్షకుడు చమత్కారముగా జేసిన మీ హితొపదేశమును విని భోజరాజు జూదము సప్తవ్యసనములలో నొకటియనియు, దానివలన సకలావనర్దములు గలుగుననియు గ్రహించి నాటనుండి నెత్తమాడుట మాని తన్ను మంచి మార్గములో దింపిన కాళిదాసునకు గృతజ్ఞడై యుండెను.

రా వే రా వే

భోజ రాజు

విదర్భదేశమును

గూడ జయించి పాలించెను. విదర్బదేశములో గొన్ని భాగములయందు మాటలాడుకొను భాష తెనుగు కాళిదాసుడు భోజమహారాజుతొ గూడ నొకసారి విదర్భ దేశమునకుబోయి రాజధానియైన విదర్భాపురముం జూచి మిక్కిలి సంతసించి పూర్వము త్రేతాయుగమున నలదమయంతుల విహారములచేత పవిత్రీకృతమై, పిమ్మట ద్వాపరయుగమున రుక్మిణి వాసుదేవుల వివాహముచేత నత్యంతపావనమై యుండిన యా పురము నీ క్రిందివిధమున వర్ణించెను.

శ్లో॥గేహే గేహే జంగమా హెమవల్లి
    వల్ల్యాం వల్ల్యాం పార్చణశ్చంద్రబింబ