పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


మూస:Righ107t

కాళిదాస చరిత్ర

రాజులని గెలిచి, నేల నాలుగుచెఱగుల నేలిన ధర్మరాజు, భార్యను, సోదరులను జిట్టచివరకు దన్నును బందెములుగా నొడ్డి యోడి, పండ్రెండు సంవత్సరము లరణ్యవాసము జేయచలసివచ్చెను. అట్టివారికే జూదము బహుకష్టముదెచ్చిపెట్టుట నీచంటివడ్రెంత? కావున జూదము మానుము" అని పలుదెఱగుల నీతులు చెప్పినను వినక భోజుడు నిరంతర ద్యూతాసక్తు డై యుండెను. అప్పుడు కళిదాసొక యుపాయము పన్ని యనాపదేశముగా నతనికి నీతి బోధించెను.

  ఒక బౌద్ధభిక్షువుని బిలిచి "భోజరాజు జూదమాడుటకై జ్యూత గృహమునకు బోవునప్పుడు నీవు మాంసపుదుకాణముదగ్గఱ నంజుడుగొను వానివలె నిలిచియుండుము" అనిచెప్పి మఱికొన్ని మాటలు వానితో రహస్యముగా జెప్పిపంపెను. భిక్షు డాప్రకారముగా మాంసపుటంగడియందు బేరమాడుచుండెను. భోజరాజాదారింబోవుచు భీక్షుకునితో మాటాడెను. వారిసంభాషణ మీ శ్లోక రూపముగానున్నది.
 భోజ: భిక్షో! మాంసనిషేవణం కిముచితం?=ఓయి 
భిక్షుకుడా మాంసము దినదగునా?
 భిక్షు: కిం తేన మద్యంవిన=మధ్యములేనిదే 
     ప్రయోజనమేమి.
  భోజ: మధ్యంచాపితనపొరియం?=నీకు మధ్యము 
     గూడా ప్రియమా?
 భిక్షు: ప్రియ మహో వారాంగనాభి స్సహం=బోగము
   వాళ్ళని గలసినప్పుడది మిక్కిలి ప్రియము
 భోజ: వారస్త్రీరతయే కుత స్తన ధనం?=బోగమువా
     ళ్ళనుంచుకొనుటకు నీకు సొమ్మెక్కడిది?
 భిక్షు: చౌర్యేన ద్యూతేన వా=దొంగతనముచేతగాని 
     జూదము చేతగాని