ఈ పుటను అచ్చుదిద్దలేదు
106
కాళిదాస చరిత్ర
తా॥ కోటి గంధములచేత జెప్పబడినదా? నేడు శ్లోకములో సగములో జెప్పెదను. పరొపకారమువలన పుణ్యము కలుగును పరులను బాధించుటవల బాసము కలుగును.
అంత పరమర్ద మీ చిన్నశ్లోకములో నిమిడి కడు చమత్కారముగా జెప్పినందుకు గాళిదాసు మహాకవి కోర్పుకు మిక్కిలి వినుతించి రాజు, సభాసదులు మిక్కిలి సంతసించిరి
జూదముమీది యావత్తు బోగొట్టుట
దీప్తిమంతమైన దీపముతోడ నించుక క్రీనీడ
యున్నట్లు చల్లని వెలుగు వెదజల్లు చంద్ర
మండలమునకు గళంకమున్నట్లు, కమ్మనితావులు వెదజల్లు గులాబి పువ్వునకు ముండ్లున్నట్లు బహుసద్గుణసంపన్నులైన మహాపురుషులయందు సైతము నొకానొక దుర్గుణము కానబడుచుండును. సట్లే భోజమహారాజునందు విద్వత్కనిజనపోషణము, దాతృత్వము పరాక్రమము మొదలగు బహు గుణము లుండినను నతనికి జూదమందు మిక్కిలి యాసక్తి యుండెను. అది యనర్దకమని యతడెఱుగును. కాని, మనస్సును రానినుండి త్రిప్పుకొనలేకపోయెను. కాళిదాసుడు రాజహితాభీ లాషి యగుటచే బలుమారు లతనిని గలసి రహస్యముగా నిట్లుహితోపదేశముచేయుచు వచ్చెను.
"ఆర్గురు చక్రవర్తులలో నొకడైన నలుడు దాయాదియైన ఉష్కరునితో జూదమాడి రాజ్యపద భ్రష్టుడయ్యెను. అంతటితోబోక జూద మా చక్రవర్తిని బరమ నీచదశకు దెచ్చెను. ఆ మహాసార్వభౌముడు పూర్వము తనకు సామంతరాజయిన ఋతుపర్ణునింట వంటవాడై,యతని రధసారధియై, కర్కోటకునిచేత గరువంబడి కురూపియై జీవింప వలసి వచ్చెను. రాజసూయముచేసి, యెల్ల