పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

105

కాళిదాస చరిత్ర

“తప్పక చంద్రుడుదయించును. తప్పక పండువెన్నెలగాయును” అని గంభీరముగ బలికెను. సరే! చూతమని రాజు వానికి సెలవిచ్చిపంపెను.

   కాళిడాసుడు స్నానముచేసి భోజనముచేయక భువనేశ్వరీ దేవతాలయమునకుబోయి యాదేవి ననేకవిధముల ప్రార్దించెను. అప్పూడు భువనేశ్వరీదేవత తనను నమ్ముకొన్న పరమభక్తునిమీద నిజకరుణాకటాక్షవీక్షణములు ప్రసరింపజేసి “వత్సా! భయపడకుము. నీమాట చెల్లించెద“ నని యభయమిచ్చి  తనకర్ణభూషణ మతనికిచ్చి సాయంకాల మైనతోడనే దాని నెగురవేయమని యానతిచ్చెను. దేవతానుగ్రహపాత్రుడైనందుకు మిగులసంతసించి కాళిదాసు నిజమందిరమునకుబోయి సూత్యాస్తమయమినతోడనే దేవీకత్ణభూషణమును మింటి కెగురవైచెను. అది యాకాశమున కరిగి చంద్రమండలముపగిది సకలకళాపరిపూర్ణమై తెల్లని కాంతులు వెదజల్లజొచ్చెను. మహారాజు పొరులు మిక్కిలి యక్కజమంది కాళిదాసుని ప్రభావము కొనియాడిరి.

వేదవేదాంగసారము

ఒకనాడు భోజభూపాలుదు

పండితమండల పరివేష్టుతుడై

ప్రసంగవశమున “వేదవేదాంగపురాణాదుల సారమంతయు నొక్క శ్లోకమున జెప్పగలరా”యని విద్వత్కవుల నడిగెను. కవు లొకతిమొగమొకరు చూచుకొనిరి.అట్లు చెప్పుట యసంభవమని కొందఱు పలికిరి. అప్పుడు కాళిదాసుడులేచి “దేవా! శ్లోకమెందుకు!శ్లోకములోసగములో నేజెప్పెద చిత్తగింపుడు“అనియిట్లు చదివెను—

శ్లో॥శ్లోకార్దేన ప్రనక్ష్యామి యనుక్తంగ్రంధకోటిభి:
   పరోపకార: పుణ్యాయ పాపాయ పరపీఅదంనమ్