Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
104

కాళిదాస చరిత్ర

    తా॥దివ్యవృక్షములచే నలకరిపబడిన ఖాండవవనము పూర్వ మర్జునిచే వ్యర్దముగా దహింపబడెను. స్వర్గతుల్యమైన, సువర్ణమయమైన, లంకాపట్టణము హనుమంతునిచే నిష్కారణముగా దగులబెట్టబడెను. సకలజంతువు సుఖప్రదుడైన మన్మధుడు గూడ శంభునుచేత నిర్హేతుకముగాగాల్పబడెను. మనుష్యులను మిక్కిలి పీడించు చున్న యీదారిద్ర్యము నెవ్వరు గాల్చలేకపోయిరి. 
   కావుననీవైనమాదారిద్ర్యము నీకొఱవులతో గాల్చివేయుమని యీబ్రాహ్మణుడు వేడుకొనిచున్నాడు“ అని సభాసదులు భోజుడు విస్మయ మందునట్లు సమర్దించెను. రాజు పరమానందభరితుడై బ్రాహ్మణునకు గొప్పబహుమానమిచ్విపంపెను.

అమావాస్యపూర్ణిమయగుట

కాళిదాసునికోటవెడలినమాటతప్పక జరిగి

తీఱురుననుటకు విచిత్రమైనకధ యొకటిగలదు.

  ఒకనాడు భోజరాజు కాళిదాసునుజూచి “నేటితిధియే“ మని యడిగెనట! కాళిదాసుడు శ్లోకమేదో యాలోచొంచుచు బరాయత్తచిత్తుడై యుండుటచేత నోరుజాఱి పొరబాటున నమావాస్య యనుటకు మాఱుగా బూర్ణిమావాస్యమని చెప్పెనట! దగ్గఱ నెవ్వరోయుండి, “నేడమావాస్యకాదా” యని యడిగెను. కాళిదాసుడు తననోట బొరబాటు మాట వెడలెనని యొప్పుకొనుటకిష్టములేక తనకు భువనేశ్వరీదేవతా. ప్రసాదముకలదు. ధైర్యముతో “ఔను. నేడుపూర్ణిమావాస్యయే, అమావాస్యకాదు”అనిదృధముగా బలికెను. అప్పుడు భోజభూపాలుడు “కాళిదాసుడా! నేడు పూర్ణిమ యైనపక్షమున బూర్ణచంద్రోదయమగునా? వెన్నెలకాయునా?” యని గట్టిగానడిగెను.