ఈ పుటను అచ్చుదిద్దలేదు
103
కాళిదాస చరిత్ర
కాళిదాసుడు రాజసబాభవనమునకరిగి ద్వారమునందొకమహా పండితు డున్నాడనియు, నతడు మాల నతము ధరించినవాడనియు, రాజుతో మనవిచేసెను. రాజు అతనిని బ్రవేశపెట్టుమని దౌవారికుని కానతిచ్చెను. ద్వారపాలకుడు గాఢ నిద్రలో నున్న యాబ్రాహ్మణుని మేలుకొలిపి "మీరేనా రాజదర్శ నార్దమై వచ్చినవా" రని యడిగి "నేనే' నని యతడు చెప్ప నవ్వి లోపలికిదీసికొనిపొయెను. జ్యేష్టాదేవి ప్రియ పుత్రుడైన యావిప్రుడు కన్నులు నులుముకొనుచు దన యంగ వస్త్రమును జుట్టబడిన వేవో చూచుకొనక చెఱుకుముక్కలే యనుకొని రాజునకబిముఖుడై కట్టవిప్పి యాకొఱవుల జేతికిచ్చెను. రాజు కొఱవు లందుకొని విస్మితుడై కాళిదాసువంక జూచెను. తానుదీసికొనివచ్చిన బ్రాహ్మణుడు మిక్కిలి యమంగళములై, యశుభచూచికములైన కొఱవులను బ్రశస్తములైన రాజహస్తముల బెట్టుటచేత గాళిదాసుడు తెల్లబోయి బ్రాహ్మణుని యవివేకమునకు నొచ్చుకొని యెట్లయిన నాతని వికృతచేష్టను సమర్దింపవలెనని భువనేశ్వరీ పాదపద్మముల నొక్కసారి ద్యానించి మహారాజుతొ నిట్లు మనవిచేసెను:
"దేవా! ఈ బ్రాహ్మణుడు కొఱవులు కానుకగా నిచ్చినందుకు మీరు విస్మితులగుచున్నారు. కోపగింపవలదు నిమ్మపండ్లో, యఱటిపండ్లో, పుష్పములో దేవరవారికి గానుకగా దెచ్చియియ్య వలెనని యీబ్రాహ్మణు డెఱుగకపోలేదు. బ్రాహ్మణ జాతిలోబుట్టి యింత వయస్సు గడపిన యీతని కింతమాత్రము దెలియకపొవునా? కాని దీనిలో గంబీరమైన యర్దమున్నది చిత్తగింపుడ్లు:--
శ్లో॥దగ్ధం ఖాండవ మర్జునేవచ వృధా దివ్యద్రుమై
ర్భూషితం
దగ్దా వాయుసుతేన హేమరచితాలంకాపురీ
స్వర్గభూ:
దగ్దస్సర్వసుఖాస్సదిశ్చ మదనొ హాహా వృధా
శంభునా
దారిద్ర్యం ఘనతాపరం భువి వృణాం కేనాది
నోదహ్యతే.