Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
90

కాళిదాస చరిత్ర

   కాళిదాసుడు తనమనస్సులో నున్న యభిప్రాయమంతయును బూర్ణముగ దీసికొనివచ్చెనని యానందించి రాజు వానికి మిక్కిలి బహుమానములిచ్చెను.

నేరేడుపండ్లు

భోజక్షితిపాలు డొక

నాడు వేట కరిగి పలు

మృగముల వేటాడి యలసి శ్రమనివారణార్దమై యొక సరోవరతీరమున దట్టమైన యాకులుగలయొక నేరేడుచెట్టుక్రింద గూర్చుండి చల్లగాలి సేవించుచుండెను. అప్పుడు కొన్ని కోతులు చెట్టెక్కి కొమ్మలం గదవుచు దుముకుచు నిచ్చవచ్చినట్లు విహరింపజొచ్చెను. అందువలన మిక్కిలి పక్వములైన నేరేడుపండ్లు తరుశాఖలనుండి యూడి క్రిందనున్న సరస్సులో “గుళు గుగ్గున గుగ్గుళు“ అనుధ్వనితో బడెను. ఆధ్వని రాజు చెవికెంతో మనోహరముగానుండెను. మరలనగరమునకుబోయినతరువాత రాజు కాళిదాసునుజూచి “గుళు గుగ్గుళు గుగ్గుళు“ అనుసమస్యనిచ్చి పూరింప్మనెను.

శ్లో॥జంబూఫలాని పక్వాని పతంతి ఇమలే జలే
   కపికంపితశాఖాభ్యోగుళు గుగ్గుళు గుగ్గుళు.

తా॥పక్వములైన నేఋఏడుపండ్లు గ్రోతులచేత గదల్పబడిన వృక్షశాఖలనుండి ‘గుళు గుగ్గుళు గుగ్గుళు ‘ అనుధ్వనితో విమల జలమునందు బడుచున్నవి.

అడవిలో నెచ్చటనో జరిగిన వృత్తాంతము గాళిదాసుడు తెలుసికొని సమస్యాపూరణము చేసినందున రాజు మిక్కిలి యానందించి యరడు సాక్షాత్పరమేశ్వరుడే యని భావించి నమస్కరించి గౌరవించెను.