ఈ పుటను అచ్చుదిద్దలేదు
96
కాళిదాస చరిత్ర
అదివిని సభాసదులు విష్మేరమనస్కులై కాళిదాసును గడుంగడు బ్రశంసించిరి.
కం దు క వ ర్ణ న ము
భోజభూపాలుడు మాఱు
వేషము వైచికొని ధారా
నగరమునందిరుగుచు నొకనాడు వేశ్యావాటికకు బోయెను. ప్రచ్చన్నుడైయుండుటచేత నతడు మహారాజని గ్రహింపలేక వేశ్యలు యధేచ్చముగా విహరించి సంభాషింపజొచ్చిరి. అందొక పడుచు వెలయాలు కాలి యందియలు ఘల్లుఘల్లని మ్రోయ, జేరి కంకణాలు గణగణ మ్రోగ దనచేతితో బంతి గొట్టుచు మిక్కిలి చమత్కారముగా నాడుచుండెను. ఆ సమయమున దాని హోయలు, దాని యొయారము, దాని సౌందర్యము, దాని చంచలనేత్రముల సొగసు వర్ణణాతీతమై యుండుటంజేసి రాజు మిక్కిలి యచ్చెరు వడి మందిరమునకుబోయి మఱునాడావృత్తాంతము దన యాస్ధానికవీశ్వరులకు దెలియజేసి బంతియాడుచున్న యా గణికను వర్ణింపు మని కోరెన్. అందు భవబూతి9 కందుక క్రీడ నిట్లు వర్ణించెను.
శ్లో॥విదితం నను కందుక తే హృదయం
ప్రమదాధరసంగమలుబ్దఇన
నవితాకరితామరసాభిహత:
పతిత: పతిత; పునరుత్పతసి
తా॥ఓబంతీ ! నీహృదలముననున్న యభిప్రాయము తెలిసినది. ఆకాంతయొక్క యధరోష్ఠ మును నీవు చుంబనముచేయందుల దుచున్నావు. అందుచేత నేకదా యా బాలిక హస్తపద్మముతో విన్నణగజఱచినమ మలమరల లేచుచున్నావు.