పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

95

కాళిదాస చరిత్ర

కొంచెము దూరముగా నొక నులకమంచముమీద బండుకొని యట్టట్టు దొరలి ప్రక్కనున్న కుంపటిలో బడెను కడుపునంబుట్టిన గారాబు బిడ్డడు దారుణ నహ్నీలో బడినను నమ్మహాపతివ్రత కొడుకు తీపి నొక మూలకు ద్రోసి మిక్కిలి యలసిసొలసివచ్చి గాఢనిద్రా వసక్తుడైన ప్రాణవల్లభునికి నిద్రాభంగ మగునేమోయని శంకించి పాదములొత్తుట మానలేదు.ఆచ్చోటునుండి కదలిరాలేదు. "నేనత్తమామలకు విధేయురాల నగుదు నేని, మగని దైవముగా నెంచుకొందునేని నాబిడ్డ కపాయము కలుగనే కలుగదు" అని నిశ్చయించుకొని మనస్సులోనగ్మిహోత్రుని వేడుకొని ధైర్యముగలిగ్తి యుండెను.

    బాటసారి వేషముతోనున్న భోజు డంతయు గనిపెట్టి మిక్కిలి యాశ్చర్యమునొంది మఱునా డుదయమున ధారానగమునకుబోయి యావార్త యెవ్వరికి దెలియ జేయక కొలువుకొచ్చి సింహాసనాశీనుడై "హుతాశం శ్చందనపంకశీతలు" అను సమస్యనిచ్చి పూరింపుమని యాస్ధానావీశ్వరుల నడిగెను. దండి భవభూతి శంకరులు మొదలగు కవులు సరిగా దానిం బూరింప లేకపోయిరి. కాళిదాసుడు కాళీ వరప్రసాదమున భోజ రాజు కంటంబడిన యావద్వృత్తాంతము నెఱిగి సమస్య  నిట్లు పూరించెను.

శ్లో॥సుతం పతన్తం ప్రసమీక్ష్య సాదకే
     నజోధయామాస పతిం వతివ్రతా
     తదాబభవత్ తత్పతిభక్తిగౌరవా
     ద్ధుతాశన శృందనపంకశీతలు

      తా॥కుమారుడగ్నిహోత్రములో బడుట గనులార  జూచియు మహాపత్నియైనభార్య భర్తను మేలుకొలప లేదు. ఆమెయొక్క పాతివ్రత్యమహిమచేత నగ్నిహొ త్రుడు మంచిగంధమువలె జల్లనయ్యెను.