పుట:హాస్యవల్లరి.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొ - ప్రైవేటుగా వెళ్ళచ్చు!

తం - అల్లాయితే దానికి తక్షణం ప్రైవేటుగా కట్టి చూడకూడదు. నువ్వూ, అదృష్టం ఎల్లాఉంటుందోనూ?

52

వనమయ్య తనికి మంచినీళ్ళు ఇయ్యగా, తాగి, చప్పరించి, కోటేశ్వరరావు - వనమయ్యగారూ! మంచినీళ్ళు కొంచెం కారం కారంగా ఉన్నా యేమిటి?

వ - ఎమోబాబూ! అక్కడికీ నేను కారం జాగర్తగా చూసే వేశానండీమరీ! ఎంచేత అల్లాఉన్నాయో!

కో - సంతోషించాంలెండి, కారంవేశానంటూ స్వంతకవిత్వం కొంతా మీరు!

వ - చాల్లెండి కారంగా ఉన్నాయంటూ సొంత పైత్యం కొంతా మీరు!

53

స్నేహితులు - సుందయ్య? నీకు డొక్కచీలిస్తే ముక్క లేదుగదా! సంస్కార్లతోపాటు, సంభావన, రూపాయి ఇచ్చిన వాడెవడ్రా?

సుం - అందరు పెద్దవాళ్ళూ వెళ్ళేవరకూ ఆగి అప్పుడొచ్చాన్నేను.

స్నే - వస్తే!

సుం - అడిగారు, ఇదివరకు వెళ్ళిన పెద్దవాళ్ళతో రాలేదేమని, వాళ్ళు పరమశుంఠ లవడంవల్ల వాళ్ళతో కలిసి నే రాలేదూ, కావలిస్తే నన్ను పరీక్షచేసుకోండన్నాను. అని ఏవో పులగపుశ్లోకాలు రొండు దంచాను.

స్నే - వాళ్ళు పోల్చలేదూ!

సుం - వాళ్ళ కవేనా రావుగా మరీ!

సుం - హారి! ఏం పుణ్యంరా! మమ్మల్నికూడా లాక్కుపోరా!

సుం - మనం చాలామంది ఓచోటే ఉంటే తెలిసి పోతాంరా! పోలికలు ఉండకపోవ్! పైగా నవ్వొస్తుంది.

54

అప్పయ్య - కుర్చీలో కూర్చోరా, తిమ్మరాజూ! వస్తున్నా. అని ఇంటిలోపలికి వెళ్ళివచ్చి, మంచినీళ్ళు తెచ్చి, ఇంకా ఏదో దెచ్చి తిమ్మరాజుకి అందిస్తూ,

అ - ఇందరా! కొంచెం పుచ్చుకో! ఈ మధ్య మా చెల్లాయి హేమలత..........

తి - ఏమిటిదీ!

అ - చలిమిడి?

తి - ఇంకా చిమ్మిలేమో అనుకున్నాన్రా! పిల్లా! పిల్లాడా?

55

వీధులో వెడుతూన్న కుంచెన్నని 'మాట' అని ఇంట్లోకి పిల్చి ఈశ్వరయ్యగారు కుంచెన్నకి దవడశుద్ది చెయ్యగా.

కుం - (తిరిగి అప్పట్లో జబరదస్తీ చెయ్యలేక) ఇదిటయ్యా నమ్మించి, లోపలకీరమ్మనీ! ఆలా యీలా కాకుండా చదివావు, ఇదేనా నీ లాహిరీ!

ఈ - ఈపాటికి కిక్కురుమనక రోడ్డుచ్చుగో! మాటాడోచ్చావు పైగాను! “ప్లీడర్ల బల్లలు నాలుగైదు తీసిపారేశానండోయ్” అని నాతో వెనక అన్నావ్, నీపోటిగాడే ఇప్పుడు నాబల్ల తీసేసి తూంలో గిరవటేశాడు.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

80

హాస్యవల్లరి