పుట:హాస్యవల్లరి.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పె - మర్యాదగా మాట్టాడు. మధ్యాహ్నంవెళ్ళి ఓ గంట మాట్టాడివచ్చాను. నీకు భరవసా ఇచ్చింతరవాత ఊరుకుంటానుటోయ్, వెఱ్ఱివాడా!

సం - ఎందుకొచ్చిందయ్యా, పచ్చి అబద్ధం? నేను ఉదయాన్నించీ గేటుదగ్గిర నుంచుంటేనే!

పె - చాదస్తుడా, రెండోగేటు లేదుటోయ్?

సం - మూడోది కూడా ఉంది. ఉంటేం? రొండో దాని దగ్గర మాతమ్ముడూ మూడో దానిదగ్గిర మాబావమరదీ పొద్దుణ్ణించీ ఉన్నారు. చేతకాకపోతే, ఆమాట అనెయ్య కూడదూ. ఇల్లా ఏడవకపోతే?

6

నారాయణ - అచ్యుతం! పాటకచేరి ఎల్లా ఉంది?

అ - ఆయన తగుదునమ్మా అన్నట్టు భాసింపట్టు వేసుగు కూర్చున్నాడు.

నా - సరేలే, పాటమాట,

అ - భైరవి ఘంట పాడాడు, భోంచేసి ఊరికే 'బేవ్' మన్నట్టు ఉందిగాని ముండావాడికి ఏమీ ఆయాసమేనా లేందే!

నా - ఏదో! తెలివిగలవాడేనా?

అ - అబ్బో! మహగడుసు! ఒక్కమాట తెలియనిచ్చాడుకాడు. మెచ్చుగునేవాళ్ళు అది చూసే!

7

సాంబమ్మ - ఏమమ్మోయి, రంగమ్మగారు! ఇందాకా మీ ఆయన నీయెదటికొచ్చి అల్లా తెయితక్కలాడుతున్నారేం? తడికిల్లోంచి చూశానూ!

రం - ఏముంది సంబడం? నిన్న మీరు మీ ఆయన ఎదట ఆడుతూన్న సంగతి కిటికీలోంచి చూశారటా. అది నాతో ఇందాకా చెప్పడంసొంపూ అది!

8

ఒక జడధారి ఒక కుర్రాణ్ణి వెంటతరిమి పట్టుగుని.

జ - ఒప్పుకో!

కు - నేను చెయ్యలేదు,

జ - చేశావు .

కు - లేదు. నువ్వు చూశావా?

జ - దేవుడు చూశాడు,

కు - దేవుడు అన్నీ చూస్తాడా?

జ - ఓ లెక్కేమిటీ ఆయనకు!

కు - మొన్నటిరోజున మానాయనమ్మ నన్ను తిడుతూంటే నేను నవ్వుతూకూచోడం దేవుడు చూశాడూ?

జ - ఓ.

కు - (జడధార్ని ముక్కుమీద ఒక్కటి ఇచ్చుగుని) ఫోసె! మా నాయనమ్మ మా నాన్నని కన్న మర్నాడు పోయిందిట!

9

పేరమ్మ - మీకేం? సినీమాలోకెడతారు, నాటకంలో కెడతారు. అడ్డమైనచోట్లకీ వెడతారు! మొగాళ్ళూ!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

68

హాస్యవల్లరి