పుట:హాస్యవల్లరి.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చం - ఏదేనా ఒకటి ఉండదేమో అనుకుంటూ మనం దాని కోసం వెతిగితే, ఆ ఒకటితప్ప కడంవి అన్నీ కంటికి కనపడతాయి.

178

అయిదోక్లాసు చదువుతూన్న రామన్న తండ్రితో,

రా - మన తలుపుమీద 2/6 అని ఉందేమిటి నాన్నా?

తం - అదా? మన ఇంటి నెంబరు.

రా - ఇది వేసేవాళ్ళకి లెక్కల్లో సున్నావస్తుంది నాన్నా.

తం - ఏం?

రా - ఆ భిన్నాంకంలో రొండు “కామను” కొట్టేసి 1/3 అని వెయ్యాలి నాన్నా!

179

రాఘవులు - రమణారావూ! సోమన్న ఈ వ్యాపారం ఇల్లా తగలేశాడేమిటీ! తనా హైరానపడ్డాడు. మనకా చిక్కులు. అందరికీ తగులుబాటైంది. వీడు వొఠ్ఠి వైదీకిలా కనబడుతున్నాడు.

రా - వైదీకైనా బాగానే ఉండును. నా ఉద్దేశంలో వీడు కేవలం జడ్‌దీకి,

180

సీతానాగయ్య - ముత్యాలూ! ఇదిట్రా చేసినపనీ! ఆ ఉత్తరం సోమేశ్వరమ్మగారికి ఇమ్మంటే సోమేశ్వరయ్యగారికి ఇచ్చావ్! వెఱ్ఱిముండావాడులా ఉన్నావెక్కడోను!

ము - నెనెనెనేను - వెవెవెవెఱ్ఱోణ్ణి కానండిబాబు, ననననత్తోణ్ణండి.

181

జగన్నాధం - అప్పాజీ! భోజనమెక్కడోయ్ యీపూటా?

అ - మన ఘంటావారి సత్రంలో.

జ - అయితేనూ, అక్కడెంతమందవుతారుపూటకీ?

అ - చాలామందవుతారు.

క - అయిదారుకుంచాలు వారతాయీ?

అ - లెక్కేమిటి? అయిదారువేల బియ్యంపైగా ఉడుకుతాయి.

182

గురువయ్య - ఉరేయి! రాయప్పా? నిన్న పొద్దున్న వస్తానని రాలేదేం?

రా - విరోచనాలకి మందుపుచ్చుగున్నాను.

గు - అయితే రొండు వారాలు తిరగలేదుకదా మొన్న పుచ్చుకుని, మళ్ళీ ఎందుకూ నిన్నా?

రా - అప్పుడా! అప్పుడు రుగ్మతగా ఉండడంవల్ల!

గు - ఇప్పుడు!

రా - ఇప్పుడా! మన్లోమనమాట. రేపు భోజనానికి వెళ్ళాలి కాట్టోయ్ మరీ!

183

గంగాధరం - ఒరేయ్, అప్పారావ్! మన శివరామమూర్తి ఉన్నాడేం? వాడు ఊరికే బుజాలు సర్దుకుంటూంటా డేమిటి? నిమిషానికోసారి?

అ - నువ్వు కనిపెట్టలా? పాపం వాడికి భుజంమీద షర్టు చిరుగూ కోటుచిరుగూ ఏకీభవించాయి. చర్మం కనిపించకుండా కమ్మడానికి వాడియత్నం.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

39

హాస్యవల్లరి