పుట:హాస్యవల్లరి.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చం - ఆ. నేను ఓ సున్నా బూర్లకంటె ఎక్కువ పుచ్చుగోలేనుష్మి! నీమాట!

సు - నేనూ ఆ రకమే. ఒక్కఅరసున్నకంటె ఎక్కువ నావల్లకాదు.

చం - జాగ్రత్తస్మీ. అరసున్న కొడవలిలా ఊరుకుని అంగుట్లో గుచ్చుకుపోగల్దు.

86

ఒక అధికారి ఒక అవధాన్లుగారితో వ్యవహారం మాట్లాడుతూ, మధ్య కోపం ఆపుకోలేక,

అధి - చాలు. సంతోషించాంగాని ఇక తమరు ఈ విషయంలో నోరుముయ్యండి.

అవ - నమోన్నమః సంసిద్ధుణ్ణి. కాని, ఎవరిదో సెలవిచ్చారు కారు.

87

పిల్లలికి భూగోళం చెబుతూ,

మేష్టరు - రొండోవాడు! లే. భూమి పెద్దదా చిన్నదా?

రొం - పెద్దదేనండి.

మే - మీ నాన్న దాన్ని చుట్టూ నడిచిరాగలడా?

రొం - నడిచిరాలేడండి! -

మే - ఎంచేత చెప్పుమరి చూస్తానూ!

రొం - నిన్న సాయంత్రం ఆయనకి కాలు బెణికిందండి.

88

బొమ్మలు రాసే సత్యమూర్తితో,

బంగారమ్మ - నాబొమ్మ వేసి పెట్టాలండి. సరిగ్గా నాకు మల్లేనే ఉండాలి, బాగుండాలి.

స - కుదరదండి. ఏదో ఒకటి మీరేచెప్పండి బాగా ఆలోచించుగుని.

89

వెంకయ్యగారు తలుపు తాళంవేసి ఊరికెళ్ళడం కనిపెట్టి, ఒకడు రాత్రి ఒంటిగంటకి తాళం తియ్యడానికి ప్రయత్నిస్తూంటే ఒక కనిస్టీపువచ్చి.

క - ఎవడ్రా, అదీ!

ఒకడు - అయ్యా! నేనండి, తాళంచెవి ఓటి దొరికింది. అది ఈ తాళానికి పెట్టిచూసి సరిపోతే ఇంటివారిని కనుక్కుని ఇచ్చిపోదాం అని చెప్పేసి వచ్చానండి.

90

ఒక ముసలిదొర ఒక చంటి పిల్లని పెళ్ళిచేసుకోడానికి చర్చికి లాక్కెళ్ళి అక్కడి అర్చకుడికి కనబడగా,

అ - ఉదకం తూర్పువేపు గదిలో ఉన్నాయి, పట్రండి.

దొర - ఉదకం ఏమిటి మీ మొహం!

అ - అల్లానా? క్షమించండి. ఈపిల్లని జ్ఞానస్నానం నిమిత్తం తీసుకువచ్చారేమో అనుకున్నాను.

91

ఒక పెద్దమనిషి ఒక మురికిబాలుణ్ణి చూసి,

పె - ఒరీ కుర్రకుంక! ఏ పెంటమీదేనా దొరికితే నీకు ఓ అణా ఇచ్చుగుంటానుగాని శుబ్బరంగా వెళ్ళి స్నానం చేసిరా, చూడలేకుండా ఉన్నాం.

అనగా, వెంటనే వాడు వెళ్లి స్నానం చేసిరాగా, అన్నప్రకారం ఆయన వాడికి అణాఇచ్చిన తక్షణం తిరిగీ ఆయన చేతులోనే పెట్టి

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

20

హాస్యవల్లరి