76
యజమాని - అయితే, బల్లవెడల్పు ఎంత, పెట్టింది?
వడ్లాబత్తుడు - నాలుగు అడుగులండి.
య - పొడుగు?
వ - మూడు.
య - అదేమిటీ అల్లా ఎల్లా ఉంటుంది.
వ - ఏమోనండి. రెండుదఫాలు కొలిస్తే, రెండుదఫాలూ కూడా పొడుక్కంటే యెలడ్పే ఎక్కువొచ్చింది.
77
మేష్టరు - 'పఠము' వర్ణక్రమం చెప్పు - మూలకూర్చున్న ఎర్రటోపీ.
ఇనస్పెక్టరు - అదేం పిలుపండోయ్! (కుర్రవాడితో) చెప్పమ్మా అబ్బాయి.
ఎర్రటోపీ - పకారాకారముల 'పా'
మే - 'పఠము' లో ఆకారం ఎక్కడుందిరా!
ఇనస్పెక్టరు - లేకపోతే ఎందుకండీ దిక్కుమాలిపఠం
78
పల్లెటూరి పెద్ద అనిపించుకున్న కాసులు, సుదర్శనంతో మాట్లాడుతూ,
కా - టెలిగ్రాం వట్టి తీగే అని కొందరి భ్రాంతి.
సు - సరిసరి. నీ నమ్మకం ఏమని?
కా - అది కేవలం గొట్టం. అందులో సరుకులు పంపుతారు.
సు - గొట్టం ఏమిట్రా నీ తలకాయ్!
కా - పైగా, ఆగొట్టంలో ఎర్రసిరా పోస్తారు.
సు - ఇదెవడు చెప్పాడ్రా?
కా - చెప్పేదేమిటి, గ్రహించాను. ఇక్కణ్ణించి తెల్లగా వెళ్లి అక్కడ ఎర్రగా అందుతుంది టెలిగ్రాం కాగితం.
79
రాజమండ్రీ కాపరస్తురాలైన రమణమ్మ తన బంధువు సుబ్బారావు వీధిగుమ్మంలోంచి దాటివెడుతూండగా.
ర - సుబ్బారావుగారూ ! ఎప్పుడొచ్చారు? మా యింట్లో ఉండనే ఉండరుగదా? ఎందుకుంటారూ? డయలేందే.
సు - తప్పకుండా ఉంటాను. కానీ, మీ ఆయన ఏడీ?
ర - తాడేపల్లిగూడెం బియ్యానికి వెళ్ళారు. (తనలో- పైకి వినపడేటట్టు) అబ్బబ్బా! ఈ చేతిమీద కురుపు అన్నమేనా వండనీయడంలేదుగదా!
సు - సరేసరే. బియ్యమూతెచ్చి, మడికట్టుగుని, వంటావండి, తినాతిని మరీవెడతానమ్మోయ్! నా బోటిగాణ్ణెప్పుడూ అతి బలవంతం చెయ్యకు.
80
కనుచీకటి వేళప్పుడు, సామర్లకోట స్టేషను ప్లాటుఫారం మీదికి అంతా మూటలు జేరేసుగుని వచ్చి నిలబడూతూండగా,
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
18
హాస్యవల్లరి