పుట:హాస్యవల్లరి.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచయిత గురించి

Bhamidipati Kameswara Rao Rachanalu -1

భమిడిపాటి కామేశ్వరరావు గారి జననం ఏప్రిల్ 1897. జన్మస్థలం - పశ్చిమ గోదావరి జిల్లా, ఆకువీడు గ్రామం. పాఠశాల విద్య - ఏలూరు, నర్సాపురం. కాలేజీ చదువు - కాకినాడ, రాజమండ్రి. 1918లో బి.ఎ. (గణితశాస్త్రం); 1922లో యల్.టి. నాటి నుంచి, వీరేశలింగం హైస్కూల్ లో గణితాధ్యాపకులు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా జూన్ 1953లో ఉద్యోగ విరమణ.

జీవితంలోని వాక్చమత్కుృతుల సేకరణ, సాహిత్య మాసపత్రిక 'భారతి'కి 1926 నుంచి కథలు, వ్యాసాల రచయితగా సంబంధి. హాస్య ప్రధానమైన నాటకాలు, నాటికలు చాలా రాశారు. అవన్నీ అపారమైన ప్రజాదరణ పొంది, చాలా ముద్రణలు పడ్డాయి. 1950 ప్రాంతంలో జయపూర్ మహారాజా శ్రీ విక్రమదేవవర్మ, రాజమండ్రి వచ్చి శ్రీ కామేశ్వరరావు గారిని 'హాస్యబ్రహ్మ' బిరుదుతో సత్కరించారు.

ఆ తరువాత ఆయన ఆంధ్రనాటక పద్యపఠనం, త్యాగరాజు ఆత్మవిచారం మొదలైన పరిశోధనాత్మకమైన రచనలు చేసి, తెలుగు సాహిత్య చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించారు.

శ్రీ కామేశ్వరరావు 28-8-1958న రాజమండ్రిలో పరమపదించారు. ఆయనకి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ప్రఖ్యాత సినీ నాటక రచయిత - శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ వీరి కుమారుడే.