పుట:హాస్యవల్లరి.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చేవాళ్లు ఇంకా సమీపించారు. చీమమ్మగారు ప్రశ్నకేకా, తక్కినవారంతా కలిసి జబాబుకేకా వేస్తున్నారు. (ఆవిడ చేసిన ప్రారంభమే ఇటీవల టాకీ ప్రదర్శనం గురించిన ఘోషణల్లో కుర్రాళ్లు నేర్చుగున్నట్టు తెలుస్తుంది!)

చీ - ఏం రకం కావాలి?

తక్కిన - కొత్తరకం కావాలీ.

చీ - ఏం సరుకు పోవాలీ?

త - ఉన్న సరుకు పోవాలీ.

చీ - ఎక్కడెక్కడ పోవాలీ?

త - ఇంటాబైటా పోవాలి.

సవారినాధంగారు కూచోపడ్డాడు.

చీ - ఏం కూడా మారాలీ?

త - అంతా కూడా మారాలి.

చీ - ఏం పత్రిక చదవాలీ?

త - యుగసంధే చదవాలి.

సవారినాధం తల వెనక్కీ కళ్లుపైకీ, కిందపడ కిందకీ పోయాయి.

చీ - ఏం వ్యాసం?

త - సమాసమీ.

చీ - ఎవరిదీ?

త - మీది!

తక్షణం ఆ స్త్రీలోకం యావత్తూ “జయ్ 'సమాసమీ'గారికీ జయ్!” అంటూ అరుస్తూ, ఒక్కొక్కరే వచ్చి తమ చేతుల్లో ఉన్న దండల్తో నాయకురాలి మెడ నిండేశారు!

- సెప్టెంబర్, 1943


★ ★ ★

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

182

హాస్యవల్లరి