పుట:హాస్యవల్లరి.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నే - అయితే, విజయం మీదే అన్నమాట!

స - అన్నమాట!

అంటూ మాట్లాడుకుంటూ ఆవీధి నడిచి ఓ మళుపు తిరగ్గానే, వెనకాల్నించి పరిగెట్టుకుంటూ, మీనయ్య చక్కావచ్చాడు. మీనయ్య సవారినాధంగారి రెండోవాడు. అతగానికి మైనారిటీబాధా, స్కూలుపైనలు పీడా రెండూ కూడా ఏక కాలమందే వొదిలి పోయాయి. మీ - లెఖ్ఖ కట్టించావా, నాన్నా!

స - అబ్బ, ఇప్పుడేమిటోయ్! ఇక్కడే నామిటీ!

మీ - అవును, చాలా అర్జెంటు.

నేను - నాకు సెలవా! ఏదో రహస్యమేమో!

స - దిబ్బ రహస్యం! తన వాటా పంచి పెట్టమంటాడు.

మీ - అందులో తప్పేముందీ! ఆ అబ్బాయినికూడా రమ్మన్నాను.

స - ఆ అబ్బాయేమిటీ?

మీ - ఒక మంచి కుర్రాడు. నా వాటా నాకు దఖలు పడగానే అతనికి ఇచ్చేస్తాను.

స - (నాతో) చూశారా, మావాడి దాతృత్వం!

నే - ఎవరి పుత్రుడు మరీ! (మీనయ్యతో) ఇచ్చేసి మరి నువ్వేం జేస్తావు బాబూ!

స - ఎం జేస్తాడూ! చెంబుకి చింతపండట్టిస్తాడు.

మీ - అదేమిటి నాన్నా! అల్లా కోప్పడతారేం? కర్మాగారంలో పనిచేస్తాను. ఇంకోళ్ళకి లేనప్పుడు నేను మట్టుకి అనుభవించనా?

స - ఏడిసినట్టే ఉంది ఆఖరికి!

మీ - అయితే నేను ఉండకుండా అసలు పోతాను. సరిగ్గా చెప్పండి ఇచ్చేదీ లేందీ! ఇస్తారా, ఆ అబ్బాయికిచ్చేస్తాను. అతనే మిమ్మల్ని 'నాన్నా' అంటాడు. ఎప్పుడూ నేనేనా? ఆ అబ్బాయి గనక రాకపోయినా, ఇష్టపడక పోయినా నావాటా ఈ ఊళ్ళో జనాని కందరికీ సమానంగా పంచి పెట్టేస్తాను.

స - కొందరికొందరికి అబ్జర్లేదోయ్, నిబోడివాటా!

మీ - అయినా పంచుతాను.

స - ఏమొస్తుంది, నీ మొహం, ఒక్కక్కళ్ళకీ! నీ వాటా నాలుగు వేలుంటే ఏమయినట్టూ, ఈ ఊరి జనాభాకీ!

నే - ఒక అరకప్పు కాఫీ విలవ రావచ్చు ఒక్కొక్కడికి.

స - బాగా చెప్పారు. అబ్బాయి, నడమ్మా! నిదానించు, అల్లానే పంచుతాన్లే.

అంటూ మాట్లాడుతూ మరోవీథి నడిచి మరోమళుపు తిరగగానే సవారినాధంగారి ఇంటి వీథులోకి వచ్చాం .

మీ - నాకు మీటింగు ఉంది, నేపోతాను. నావాటా విలువకి చిల్లర పట్రండి.

స - అదోటా! .. పోనీ అన్నానికొస్తావా!

మీ - రాత్రి మాకు మరో మీటింగు లేకపోతే వస్తాను.

స - సరే.

మీనయ్య వెళ్ళిపోయాడు మేంనడుచుగుంటూ సవారినాధంగారి ఇంటి ఎదటికొచ్చాం . ఓజట్కాలోంచి మువ్వదిగుతోంది. మువ్వ సవారినాథంగారి పెద్ద కూతురు. ఆ అమ్మాయి

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

178

హాస్యవల్లరి