పుట:హాస్యవల్లరి.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూదం - బ్రాకెట్

(సభఎదట ఏ విషయం మాట్లాడం నయం అని ఆలోచిస్తే సభ, నయం అనే మాటలవల్ల 'జూదం' అనే మాట స్పురించింది. నాబోటి తెలిసీ తెలియని వాడికి 'జూదం' తగిన విషయంలానే కనిపించింది. దాని పుట్టుపూర్వోత్తరాలు, రకాలూ, ఫలితాలూ గురించిన ప్రసంగం ఇది 17-12-1942)

జూదం అనేది యూరప్‌లో బి.సి. 1244 లో పెలోమిడిస్ అనే వ్యక్తి మొదట కనిపెట్టినట్టు ఉంది. ఇంగ్లాండులో మొదట జూదం ఆడడం క్రీ.త. 1567 లోట! మొన్న 1845 లోగాని టెన్నిస్ మొదలైన ఆటలుకూడా ప్రభుత్వామోదం పొందనేలేదుట. కాని, అంతకంటె వేలాది సంవత్సరాలుపూర్వమే, నలరాజుకాలంనాటికే, పాచికలు ప్రచారంలో ఉన్నట్టు మనం ఎరుగుదుం. సరి, ఇక మహాభారతకథ నాటికి (విధిగా రచనాకాలంనాటికి) జూదం భారతదేశంలో వన్నెకెక్కినట్టు తెలుస్తోంది. వేషం పిరాయించి అజ్ఞాతవాసంలో ఉన్నా ధర్మరాజుని జూదం వదలనే లేదనిన్నీ, అతడు విరాటరాజునికూడా అందులోకి దింపాడనిన్నీ, అతడు కోపంవచ్చి సారెతో ఇతణ్ణి కొట్టినప్పుడు రక్తంరాగా నిరంతరాలోచన చేసి, ధర్మరాజు, ఎంత గట్టిగా విసిరినాసరే మొహం రక్తం చిమ్మని పాచికలు సృష్టించి ద్యూతప్రపంచంలో గొప్ప పరిణామం తెచ్చి బిరుదు కొట్టాడనిన్నీ, ధర్మరాజే జూదపాటల్లో సరికొత్త రకాలు కనిపెట్టాడనిన్నీ అనద్యతన భూత కాలజ్ఞులు నొక్కిరాశారు. ఏపరిమాణంలో అయితేం, కాపట్యం ప్రమాణంగా తీసుగుని చూస్తే, జూదం - కిరికం, చరం, నయం, అని త్రివిధంగా చెప్పవచ్చునన్నారు. ఇందులో మొదటిదే దుర్ద్యూతం అనీ, దురోదరం అనీ, మాయాద్యూతం అనీ అంటారు. (శకుని వంటి అక్షవిద్యాపూర్ణుడు తను కాసిన సంఖ్య పడేటట్టు పాచికలు విసరగల నేర్పు చూపెట్టి మాయ చెయ్యగలిగినప్పుడు!). వినోదమాత్రంగా ఆడే జూదాన్ని సుహృద్ద్యూత మనీ 'నయం' అనీ అనచ్చు. మిశ్రమవిశేషాన్ని, ఐశ్వర్యం చేతులు మారుతుంది గనక, 'చరం' అంటే బాధలేదు. కాని, ఆటసాధనాల్ని బట్టిచూస్తే, జూదం రెండు రకాలే - ప్రాణిద్యూతం, అప్రాణిద్యూతం! ప్రాణిద్యూతంలో! వస్తాదులు, సింహాలు, గుర్రాలు, గొర్రెలు, కోళ్ళు, పావురాలు, ఎడ్లు, మొసళ్ళు, తాంబేళ్ళు, పందికొక్కులు - ఇల్లగా ఉండవచ్చు. అప్రాణి ద్యూతంలో! పాచికలు, ఏట్లు, గవ్వలు, దశావతారీ, చదరంగం, చీట్లపేక, అక్షరాలు, అంకెలు - ఇటువంటివి కావచ్చు, ఆడేవాడు ఒడ్డేపణం ఏమిటయి ఉండవచ్చును? అంటే, రొఖ్ఖం, నగలు, ఇల్లు, పొలం, పెళ్లాం, పిల్లలు తను ఏదైనా సరే, పూర్ణంగా తనకి హక్కున్నది - అయిదో వంతు హక్కు మాత్రమే తనకి ఉన్నా యావత్తు ద్రౌపదినీ ఒడ్డి ఆడిన ధర్మరాజుమోస్తరు కాకుండా! కాని, హింసలేని వినోదమే పరమావధిగా మానవులు మొదట ఇవి అభ్యసించినట్టు తెలుస్తుంది. ఇటువంటి వినోదాల నిమిత్తం పోగవుతూండే జనసమూహన్నే మొదట్లో 'సభ' అని పిల్చేవారు అనికూడా అనుకోవచ్చు, వీటి అన్నింటిలోనూ కేవల కాపట్యమూ, కేవల ధనాశా మాత్రమేకాక, విజయనిర్ధారణలో ఉండగల అనిశ్చితత్వం అనే అదృష్టం నక్కి ఉంటుంది. అదృష్టం అంటే సంభవనీయతలో ఆనుకూల్యం. ఒక క్రియ కోరినరీతిని

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

168

హాస్యవల్లరి