పుట:హాస్యవల్లరి.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పన - ఇది వెన్నావారిది.

వన - నాకూ తెలుసు.

పన - వారిదగ్గర అయిదేళ్ళకి నేను కౌలు రాయించుగున్నాను.

వన - అంతకు పూర్వమే రాయించుగుని దుబ్బులు నేయించింది. నేనే.

పన - వారి మైనరు కొడుకుచేతకూడా నిశానీ పెట్టించాను.

వన - ఆస్తి అయనపెళ్ళాంపేర ఉందిట, నేను ఆవిడ దగ్గిరే పుచ్చుగున్నాను.

పన - నేను సాగు చేస్తాను; రేపటెల్లుండి అరక దున్నుతాను; మీ వేపున మొదలెడతాను?

వన - అల్లా అయితే మాకు కోపం రావలిసివుంటుంది!

పన - మేం దున్నడం మానం!

వన - మేం అటకాయిస్తాం!

పన - మేం అడొచ్చినవాళ్ళని గిరవటేస్తాం.

వన - మేం కొమ్ములు ఊడగొట్టిస్తాం.

పన - మేం పేర్లు నాశనం చేయిస్తాం

వన - మేం అంతా నాశనం చేసి చూపిస్తాం.

పన - మేం పట్టిన కుందేటికి మూడే కాళ్లు!

వన - మాకుందేటికి కాళ్ళే ఉండవు.

పన - అల్లాంటి కుందేల్ని దొర్లిస్తాం!

వన - ఇల్లాంటి ద్రోహాలు చేసేవాళ్లని మేం తిట్టి పోస్తాం.

పన - ఎప్పణ్ణించి తిట్టిపోస్తారూ?

పన - రేపు చల్దివణ్ణం తిని గట్టుమీద కూర్చుని నిర్భయంగా తిడతాం. వినడానికి జనాన్ని కూడా పిలుస్తాం భయమా?

వన - జనాన్ని పిలవడానికి ఎప్పుడు వెడతారూ? రాత్రేనా?

వన - రాత్రి చీకటిగనక, ఉభయులమూ కలిసే వెళ్ళి పిలుద్దాం! చూస్కోండి మజాకా!!

మర్నాడు ఉదయం ఏడుగంటలకి కాలవగట్టుమీద ఓ పాతికజనం పోగయారు. బాగా నాలుగైదుగజాల ఎడంలో వనమయ్య పనసయ్యలు వాళ్ళ వాటాలకి సూటిగానే కూచున్నారు, కొద్దిగా ఎదురెండగా ఉంది. పనసయ్య గొడుగు వేసుకున్నాడు మరోటి తెప్పించి వనమయ్యకి ఇచ్చాడు. వనమయ్య ఉపక్రమించగా పనసయ్య అందుకున్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఒకర్ని ఒకరు చూసుకోకుండా, వచ్చినమాట రానీకుండా, గొంతిగలు పోకుండా, చెమట పట్టకుండా, చెక్కు చెదరనియ్యకుండా, అశ్లీలాలు దొర్లకుండా తిట్టుగోడం నడిపించగా ఆట్టే హుషారీ లేకపోడంవల్ల జనం ఒకమోస్తరుగా ఉందన్నారుగాని బాగా మెచ్చలేదు. భోజనం వేళకి సమరం చాలించి అభ్యర్థులు వెళ్ళిపొయ్యారు. మెతుగులు నోట్లో వేసుగుని వీలైనంత వేగిరం రావచ్చుగదా అని జనం పరిగెట్టారు.

ఆరోజు సాయంత్రం తిట్లనిమిత్తంఛాన్సు స్త్రీల కిచ్చేశారు. వనమయ్య పెళ్ళామూ పనసయ్య వెధవఅక్కా ఒక ఉర్జీగానూ, వనమయ్య ముసలితల్లీ పనసయ్య సుస్తీపెళ్ళామూ ఒక జోడాగానూ ఏర్పడి వాగ్యుద్ధం కానిచ్చారు. అది ప్రారంభంలో వాచిక ప్రధానంగా ఉన్నా, కాలక్రమాన్ని అభినయవీక్షణ ప్రధానంగా మారింది. అప్పుడుకూడా అస్పృశ్యతకి భంగం ఏమీరాలేదు. పోగైన శ్రోతల్లో పెద్దలు ఈ స్త్రీలు తిట్టుకోడంకూడా ఎంతమాత్రం

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

163

హాస్యవల్లరి