పుట:హాస్యవల్లరి.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వియ్యం - లేవు (అని ధిక్కరించి చూశాడు)

కన్యాప్ర - ఉన్నాయి! ఉన్నాయంటూంటే ఏమిటది పోట్లగేదిలా అల్లాచూస్తావ్!

అంటూ వియ్యంకులిద్దరూ చెయ్యీచెయ్యీ కలుపుకోవడంలోకి వచ్చింది. ఆ సమయంలోనే, వాణ్ణితగలెయ్యా, చాకలాడు వీధులోంచి ఈలేశాడు, నాకు పైప్రాణాలు పైన పోయాయి. తక్షణం నేను ధైర్యం తెచ్చుకొని కంబళీ ఓటితీసి వియ్యంకులిద్దరికీ మూలగా ముసుగేసి, వాళ్ళని అందులో తగ్గుస్థాయిలో దెబ్బలాడుకోండని, నాపక్క విప్పిపరుచుకొని, తక్కిన వాళ్లందర్నీ ఒరగమని సంజ్ఞచేసి, మంగళసూత్రాలు - తీరానోట్టో పెట్టుగుంటే ఎవడేనా శత్రుమధ్యం వెధవొచ్చి, నన్ను సాచి లెంపకాయకొడితే ఊడి ఇవతల పడతాయేమో అని భయపడి - రొండిని దాచేసుగుని, పడుకుని, దుప్పటి తీసి రాయిలాతొక్కిపెట్టి మేకు బందీ చేసి ముసుగెట్టాను. ఒక్క నిముషం నిశ్శబ్దంగా సమాధిలా ఉంది. ఎవరో పైనించి తలుపుతట్టారు. తప్పకుండా పోలీసు యములాళ్ళే అయి ఉంటారనుకుని నేను స్పుటంగా హెచ్చుస్థాయిలో గుర్రు ఝమాయించాను. తలుపు మళ్ళీకొట్టి మళ్ళీకొట్టి అవతల కుంక ఆగిపోయాడు. వెంటనే గభీమని ఎవడో దొడ్లోకి దూకాడు. నాకు నిజంగా ప్రాణం గక్కురుమని గుండె నోట్టో కొచ్చినట్టయింది. “బాబుగారండి, ఓడూ లేడండి. నేను సాకల్నండి” అన్నాడు ఆ వచ్చిని చచ్చినాడు. “ఓరి వెధవ గదరా, వెధవా” అనుకున్నాను నేను. “ఆడూ నేనూ ఈలకోసరం పట్టింపులోయాం అండి. నేనుగల్తే ఈల నోట్టో యెట్టుగునే ఆడిమీద కలమడ్డామండి. అల్లానే ఆణ్ణి తిట్టడంలో కాంతంత కూసినట్టు తమరికిగాని యినమడింది గాబోసును!” అంటూ కూడా తమరి దెబ్బలాట సంగతి ఆ పీనుగుచెప్పాడు. ఈ పాటికి ముసుగులోంచి పైకొచ్చి వియ్యంకుల మీది కంబళీ తీసి వాళ్ళని బహిరంగ పరిచాను. అప్పటికి వియ్యంకులు యజ్ఞోపవీతాలు తెంపుగోడం పూర్తికాగా, ఒకరి శిఖ ఇంకోరిచేతుల్లో పట్టడి ఉండగా, తలుపు చప్పుడు వల్ల ఆగి ఒకర్నొకరు మోరచూపు చూస్తూఉన్నారు. అప్పుడు నేను కలగచేసుగుని, శబ్దం చెయ్యకుండా గొంతికలట్టుగుని ఇద్దర్నీ గుంజి, లేవదీసి ముక్కుమీద వేలేసుకొని, చాకల్ని మళ్ళీ కాపలాకి సాగనంపి, కన్యాప్రదాతచేత పెళ్ళి కొడుకు కాళ్ళు కడిగిపించి, పెళ్ళికూతుర్ని తీసుగురమ్మని సంజ్ఞచేశాను. ఓ వితంతువు తన సంచీలో దాచి తెచ్చిన తట్ట పట్టుగొచ్చి పెళ్ళికూతుర్ని అందుల్లో కూచోమంది. అని, 'మేనమామ రాలేదు. పెళ్ళికొడుకు బావగార్ని తట్టతీసికెళ్ళమనండి. మా పిల్లంది తట్టల్లో తలవంచుగు కూచోడం చూసి మురిసిపోవాలని మేం ఉన్నాం' అనికూడా అంది. అల్లానే నేను చేయించి, “ముమూర్తం దగ్గరికొచ్చి మీదపడిపోతోంది, తెండి జీలకర్రా బెల్లమూ” అన్నాను. అని ప్రవరకొంచెం చెబుదాం అనుకునేసరికి, వీళ్ళిద్దరి గోత్రాలూ ఒకటే, వీళ్ళ మొహం ఈడ్చా! అంతా తెల్లపోయారు. కాస్త సమాళించుగుని కన్యా ప్రదాత అప్పగా రొచ్చి, “ఏమిరా! తమ్ముడూ! కాస్త గోత్రం సంగతి చూసుగోరుట్రా, ఇంత ఖర్చూ. పెడుతూనూ!” అంది. అతను “ఎమో, నాకేం తెలుసూ! మీరంతా తాంబూలాలుచ్చుగోడం అంటూ అట్టహాసం చేసి వార్నీ వీర్నీ కేకేస్తే, వెల్లడయి కొంప తవ్వుతుంది వద్దు కాకవద్దని, నాలిక తెంపుగున్నారుగా! తాంబూలాలప్పుడు వాడూ నేనే ఉంటా! ఆ వెధవ ఊహూ మళ్ళీ మళ్ళీ రూపాయిలు లెఫ్టిచూసుకోవడమే! నేను పిల్లకి ఎల్లా నేనా కన్నె చెరవదిలించి ధర్మం ఎల్లనో నిలిపెడదాం అనే!” అన్నాడు. మనస్సుల్ని బట్టి చూస్తే వివాహానికి స్త్రీ

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

143

హాస్యవల్లరి