పుట:హాస్యవల్లరి.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడిచేతికర్రలాగ కనిపిస్తూండే మనవాడూ ఒంటినిండా చిందూరం పూసుగుని గోదాలో దిగగానె.

కొత్తవాడు - (కుడితొడమీద కొట్టుగుని ఠపేలుమని పించాడు.)

మనవాడు - (సరిగ్గా అల్లానే చేశాడు. )

కొ - (దండకొట్టి ఠపేలుమని పించాడు)

మ - (సరిగ్గా అల్లానే చేశాడు.)

కొత్తవాడు చేసినదానికి అర్థం మనవాడు గ్రహించుగున్నాడని జనం అనుకున్నారు.

మ - (కొత్తవాడికేసి చూపుడువేలు చూపించాడు.)

కొ - (ఇదేముటో తెలియక తెల్లపోయి ఒకఅంగ వెనక్కి వేశాడు. జనంలో కలకలం బయల్దేరింది)

మ - (తనకేసి చూపుడువేలు చూపించుగున్నాడు.)

కొ - (మరో అంగ వెనక్కి వేశాడు. )

- జనం కొంచెం కేకలూ లేవిడీలూ మొదలెట్టారు.

మ - (కొట్టడం సూచిస్తూ తనచేత్తో గాలిని పైనించి కిందికి నరికాడు.)

కొ - (రెండు మూడంగలు వెనక్కి వేశాడు.)

జనం, ఓరిబుట్టబొమ్మా ఓరిడబ్బా అని కేకలేస్తూ చప్పట్లు కొట్టేశారు.

మ - (అడుగున్నర ఎత్తు సూచిస్తూ తనరొండు అరచేతులూ పట్టి నుంచున్నాడు.)

కొ - (భయంతో వణికిపోయాడు.)

జనం ఈలలూ కేకలూ అరుపులూ చరుపులూ బాదులూ మొదలైనవాట్లతో మహాకోలాహలం చేశారు.

మ - ఏమిటి? (అన్నట్టు గుప్పిడిపట్టి ఊపుతాడు.)

కొ - (పుంజాలు తెంపుగుని పారిపోయాడు. )

జనం మనవాణ్ణి చేతులమీద ఎత్తేసి, నెత్తిమీద కూచోపెట్టుగుని భుజాలమీద ఉరేగించగా,

మహారాజు - ఏమయ్యా! వాణ్ణి ఎల్లా గెలిచావు?

మ - ఏమో మహప్రభూ!! నాకు తెలియదు.

మహా - కుస్తీలో నీకు తెలిసిన ప్రథమ విషయాలే తనకి తెలియవని వాడు పారిపోయి ఉంటాడు. మీరు మీ రహస్యం కాస్త విప్పిచెప్పండి.

మ - (వాడికేసి చూపించి) నువ్వు, (నాకేసి చూపించుగుని) నన్ను, (కొట్టడం) చంపేసేస్తావనుకో, (అరిచేతులు సూచిస్తూ) మరి మా అబ్బాయి ఉన్నాడు, (గుప్పిడి) వాడి మాట ఏమిటి? అన్నాను. గ్రహించుగోలేక వాడు తోకముడిచాడు.

152

ఏదో సుస్తీగాఉండి బాధపడిపోతూన్న మనోహరమ్మగారు వైద్యుడైన ఒక రావుగారికి కబురుపెట్టగా, ఆయన మనోహరమ్మ ఇంటికి వచ్చి, ఆవిడమంచంమీద పరుండడం గమనించి,

వై - పెద్దలు లేరండీ!

మ - (మూలుగుతూ, గట్టిగా) నాన్నా నాన్నా!

అని కేకేసేసరికి, దగ్గుతో వంగిపోయిన చెమిటి తండ్రివచ్చి పక్కనికూచోగా, వైద్యుడుకూడా కూచుని,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

109

హాస్యవల్లరి